https://oktelugu.com/

బీజేపీ వర్సెస్‌ టీఆర్‌‌ఎస్‌.. సిద్దిపేటలో హైటెన్షన్‌

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో పోలీసులు చేసిన సోదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ వ్యక్తి ఇంట్లో దొరికిన డబ్బును బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఇచ్చేందుకేనని పోలీసులు చెప్పడం.. డబ్బు సంచితో కనిపించిన కొందరు పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. సోదాలు జరిపిన పోలీసులు మాత్రం రూ.18 లక్షలు దొరికాయని చెబుతున్నారు. Also Read: బీజేపీలోనూ అదే ‘కథ’: రాజకీయాలకు ‘మోత్కులపల్లి’ గుడ్‌బై.? అభ్యర్థి రఘునందన్‌రావు మాత్రం తమ ఇళ్లల్లో పోలీసులకు ఎలాంటి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2020 10:59 am
    Follow us on

    High tension in Siddipet

    దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో పోలీసులు చేసిన సోదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ వ్యక్తి ఇంట్లో దొరికిన డబ్బును బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఇచ్చేందుకేనని పోలీసులు చెప్పడం.. డబ్బు సంచితో కనిపించిన కొందరు పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. సోదాలు జరిపిన పోలీసులు మాత్రం రూ.18 లక్షలు దొరికాయని చెబుతున్నారు.

    Also Read: బీజేపీలోనూ అదే ‘కథ’: రాజకీయాలకు ‘మోత్కులపల్లి’ గుడ్‌బై.?

    అభ్యర్థి రఘునందన్‌రావు మాత్రం తమ ఇళ్లల్లో పోలీసులకు ఎలాంటి డబ్బు దొరకలేదని, ఆ మొత్తం పోలీసులే పట్టుకొచ్చి తమ ఇంట్లో దొరికాయని చెబుతున్నారు. తనిఖీలతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసుల వద్ద ఉన్న డబ్బును లాక్కొని.. పోలీసులు తెచ్చిన డబ్బంటూ అందరికీ చూపించారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తల తోపులాటలో రఘునందన్ రావు సొమ్మసిల్లి పడిపోయారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయడంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

    ఈ రణరంగాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే రఘునందన్‌రావు నివాసానికి చేరుకున్నారు. ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సెర్చ్ వారెంట్ లేకుండానే పోలీసులు వచ్చి తనిఖీలు నిర్వహించారని చెప్పారు. ఇళ్లంతా చిందరవందర చేశారని.. మహిళ అనికూడా కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించారని, రఘునందన్‌, సంజయ్‌, జితేందర్‌‌రెడ్డి, వివేక్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

    పోలీసులే కోడ్‌ అతిక్రమించారని.. రఘునందన్‌రావును అధికార పార్టీ వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. ఈ ఘటనలపై కేంద్ర నాయకత్వానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. అధికార టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని, వాటిలో చిక్కుకోకూడదని బీజేపీ నేతలకు సూచించారు.

    మరోవైపు రఘునందన్‌రావును పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. పోలీసులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది. పోలీసులు బలవంతంగా వాహనంలోకి తోసేయడంతో సంజయ్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఆ తర్వాత ఆయనను కరీంనగర్‌కు పంపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ కరీంనగర్‌‌ పార్టీ ఆఫీసులో సంజయ్‌ దీక్షకు దిగారు. సిద్దిపేట సీపీపై క్రిమినల్ కేసు పెట్టి, సస్పెండ్ చేసేవరకు తాను దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దీక్షకు దిగిన సంజయ్‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఫోన్‌లో పరామర్శించారు. దుబ్బాక ఘటనపై ఆరా తీశారు. కేంద్ర బలగాలతో దుబ్బాకలో ఎన్నికలు జరిపించాలని సంజయ్‌ కోరారు.

    Also Read: ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్..

    కాగా.. సంజయ్‌ అరెస్టుపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు అయిన వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదని అన్నారు. సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని అన్నారు. పోలీసులు తమ విధులు నిర్వహించాలని, ఇలా దుందుడుకుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ పైనా, బీజేపీ నాయకులపైనా పోలీసు చర్యలు సందేహాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల నియమావళిని, నిబంధనలను అన్ని పార్టీలకు ఒకేలా వర్తింపజేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.