తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరూపించుకోవడంతో ఇప్పుడు ఏపీలోనూ అదే దూకుడుతో వెళ్లాలని ఏపీ బీజేపీ ఉబలాటపడుతోంది. ఏపీ ఎన్నికల సీజన్ ముందు ఉండడంతో వైసీపీ, టీడీపీలకు ‘ముందుంది ముసళ్ల పండుగ’ అని బీజేపీ భావిస్తోందట.. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలంగాణలో బండి సంజయ్ ను మించి దూకుడైన రాజకీయాలతో దూసుకుపోతున్నారు.
Also Read: ఏపీలోనూ బీజేపీ బలపడనుందా.?
ఇప్పటికే హిందుత్వం, దేవాలయాలపై దాడులు, అపచారాలు, విగ్రహాల ధ్వంసంపై సోము వీర్రాజు పోరాటం అధికార వైసీపీని కూడా డిఫెన్స్ లోకి నెట్టింది. ఇప్పుడు సోము వీర్రాజు సరికొత్త టాస్క్ తో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడు సోము వీర్రాజు టాస్క్ ఏపీ ఎన్నికలపై పడింది. ఎన్నికల సీజన్ లోకి బీజేపీ వచ్చేసినట్టైంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బలం. ఆ బలాన్ని విజయంగా మార్చడం.. ప్రజల్లో బలం పెంచుకోవడం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతోంది.
Also Read: ఏపీ ప్రజలకు జగన్ వరం.. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు
ఏపీలో బలం నిరూపించుకునేందుకు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పక్కా ప్లాన్ రెడీ చేశారు. అందుకే తాజాగా ఏపీలో స్థానిక ఎన్నికలను కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని ఏపీ ఎన్నికల సంఘాన్ని కోరారు. దానికి సోము వీర్రాజు సరైన కారణాన్నే చెబుతున్నారు.
ఏపీలో బీజేపీ వ్యూహాన్ని సిద్ధం చేయడంలో సోము వీర్రాజు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఏపీలో స్థానిక ఎన్నికలు రెండు నెలలు ఆగితే ఏపీలో కొత్త ఓటర్లు వస్తారు. జనవరి 2021కి కొత్త ఓటర్ లిస్ట్ తయారవుతుంది. వారికి కూడా ఓటు వేసే చాన్స్ వస్తుంది. బీజేపీకి సహజంగా యువతలో ఫాలోయింగ్ ఎక్కువ. దేశభక్తి పాల్లు యువతలో ఉండడం బీజేపీకి కలిసి వస్తుంది. అందుకే సోము వీర్రాజు ఏపీలో స్థానిక ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేయాలని కోరారు. కొత్త ఓటర్లైన యువతకు కూడా ఓటు వేసే చాన్స్ వస్తుందని ఆయన ఎన్నికల సంఘానికి తాజాగా రాసిన లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
నిజంగా సోము వీర్రాజు చేసింది మంచి విలువైన సూచనే. దీనివల్ల బీజేపీకి లాభం కలుగుతుంది. ఎన్నికల్లో ఎంతమంది అదనంగా పాలుపంచుకుంటే అంతగా ప్రజాస్వామ్యం వికసిస్తుంది. 2021 జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటేసేందుకు రెడీ అవుతారు. అది బీజేపీ గెలుపునకు దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఐడియా వర్క్ వుట్ అయితే ఏపీలో సోము వీర్రాజు వ్యూహం విజయవంతమైనట్టే లెక్కా..