టీఆర్ఎస్ కు షాక్.. దుబ్బాకలో బీజేపీ విజయదుందుభి

తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ కు భంగపాటు ఎదురైంది. మొత్తానికి బీజేపిని వరించింది. 1,118 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలో 12 రౌండ్లలో బీజేపి మెజారిటీ సాధించగా, 1 0 రౌండ్లలో టీఆర్ఎస్ కు, ఒక రౌండ్ లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది.  హోరాహోరీగా సాగిన ఈ ఫైట్ లో చివరకు బీజేపీని విజయం వరించింది. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల […]

Written By: NARESH, Updated On : November 10, 2020 4:03 pm
Follow us on

తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ కు భంగపాటు ఎదురైంది. మొత్తానికి బీజేపిని వరించింది. 1,118 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలో 12 రౌండ్లలో బీజేపి మెజారిటీ సాధించగా, 1 0 రౌండ్లలో టీఆర్ఎస్ కు, ఒక రౌండ్ లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది.  హోరాహోరీగా సాగిన ఈ ఫైట్ లో చివరకు బీజేపీని విజయం వరించింది.

తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ప్రతి రౌండులోనూ బీజేపీ ఆధిక్యత కనబరచగా.. చివరకు వచ్చేసరికి టీఆర్ఎస్ కొన్ని రౌండ్లలో ఆధిక్యత చాటింది.

చివరకు ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎక్కువ ఓట్లు సాధించి గెలుపొందారు. తాజాగా ఆయనే గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు.

అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత స్వల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలవగా.. మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిలిచారు.

ఈ విజయంతో అధికార టీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని యోచించిన గులాబీ దండు ముందరి కాళ్లకు బంధం వేసినట్టైంది. 2024 ఎన్నికల్లో బీజేపీకి ఈ ఫలితం బూస్ట్ లా మారింది. ఇక వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఈ ఫలితాలు కొండంత బలాన్ని ఇస్తాయని అంటున్నారు.