మరో రాష్ట్రంలో కూల్చివేతకు బీజేపీ రె‘ఢీ’!

కావేవీ కూల్చివేత్తలకు అనర్హం అన్నట్టు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కొలువుదీని ప్రభుత్వాలను కూల్చడం.. ఎమ్మెల్యేలను లాగడం.. రాజీనామాలు చేయించడం.. వారిని గెలిపించి తిరిగి అధికారంలో స్థిరపడడం బీజేపీ అలవాటుగా మార్చుకుంది. Also Read: ట్రంప్ నకు ఇక రాజకీయ మరణమేనా? మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో అక్కడి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలను కూల్చేసి ఎమ్మెల్యేలను కొనేసి వారితో రాజీనామాలు చేయించి ఆ మెజార్టీతో బీజేపీ ఆ రాష్ట్రాల్లో గద్దెనెక్కింది. ప్రజలు తిరస్కరించినా కూడా గద్దెనెక్కి.. […]

Written By: NARESH, Updated On : January 10, 2021 7:32 pm
Follow us on

కావేవీ కూల్చివేత్తలకు అనర్హం అన్నట్టు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కొలువుదీని ప్రభుత్వాలను కూల్చడం.. ఎమ్మెల్యేలను లాగడం.. రాజీనామాలు చేయించడం.. వారిని గెలిపించి తిరిగి అధికారంలో స్థిరపడడం బీజేపీ అలవాటుగా మార్చుకుంది.

Also Read: ట్రంప్ నకు ఇక రాజకీయ మరణమేనా?

మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో అక్కడి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలను కూల్చేసి ఎమ్మెల్యేలను కొనేసి వారితో రాజీనామాలు చేయించి ఆ మెజార్టీతో బీజేపీ ఆ రాష్ట్రాల్లో గద్దెనెక్కింది. ప్రజలు తిరస్కరించినా కూడా గద్దెనెక్కి.. ఉప ఎన్నికల్లో తిరిగి అధికారబలంతో గెలిచి అధికారాన్ని సుస్థిరం చేసుకుంది.

ఇప్పుడు బీహార్ లో కూడా అదే స్ట్రాటజీతో బీజేపీ ముందుకెళుతోంది. అక్కడ కూడా బీజేపీ-జేడీయూ సర్కార్ అంపశయ్యపైనే ఉంది. మేజిక్ మార్క్ కు కేవలం 3 సీట్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి. ప్రతిపక్ష ఆర్జేడీ కూటమికి 110 సీట్ల బలం ఉంది. దీంతో ఎప్పుడు కూలిపోతుందనే భయం బీజేపీలో బీజేపీని వేధిస్తోంది. అందుకే ఇప్పుడు రూటు మార్చి కాంగ్రెస్ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలను లాగేస్తోంది.

Also Read: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవాళ్లకు అలర్ట్.. పాటించాల్సిన జాగ్రత్తలివే..?

బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా సహా 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారట.. దీంతో కాంగ్రెస్ లో కలవరం.. బీజేపీలో ఆనందం నెలకొంది.

ఇప్పటికే బీజేపీలో తక్కువ సీట్లు వచ్చినా నితీష్ ను సీఎం చేసి బీజేపీనే ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు ఆ బలాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేస్తోంది. మరో రాష్ట్రంలో కాంగ్రెస్ కొంప కూల్చేసేందుకు బీజేపీ రెడీ అయ్యింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్