https://oktelugu.com/

తనకు పోటీ ఎవరో చెప్పిన రకుల్ !

సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ రేటింగ్ చాలా త‌క్కువ.. వందలో ఒకరు ఇద్దరు మాత్రమే ఒడిదొడుకులు, ఫెయిల్యూర్స్‌ను త‌ట్టుకుని స్టార్ గా మారగలరు. అయితే, హీరోయిన్ల ప‌రిస్థితి మరీ దారుణం. అందం ఉన్నా.. హీరోయిన్ అయిపోలేరు. దర్శక నిర్మాతలను కరెక్ట్ గా మెప్పించగలగాలి. దానికి నటనే అక్కర్లేదు. ఎన్నో విషయాల్లో ఎన్నో రకాలుగా హీరోయిన్ లకు అవకాశాలు వస్తాయి. అయితే తాజాగా అందాల భామ ర‌కుల్ ప్రీత్‌సింగ్ త‌న కెరీర్, పోటీదారుల గురించి చెప్పుకొచ్చింది. ఎప్పుడో వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ […]

Written By:
  • admin
  • , Updated On : January 10, 2021 / 07:12 PM IST
    Follow us on


    సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ రేటింగ్ చాలా త‌క్కువ.. వందలో ఒకరు ఇద్దరు మాత్రమే ఒడిదొడుకులు, ఫెయిల్యూర్స్‌ను త‌ట్టుకుని స్టార్ గా మారగలరు. అయితే, హీరోయిన్ల ప‌రిస్థితి మరీ దారుణం. అందం ఉన్నా.. హీరోయిన్ అయిపోలేరు. దర్శక నిర్మాతలను కరెక్ట్ గా మెప్పించగలగాలి. దానికి నటనే అక్కర్లేదు. ఎన్నో విషయాల్లో ఎన్నో రకాలుగా హీరోయిన్ లకు అవకాశాలు వస్తాయి. అయితే తాజాగా అందాల భామ ర‌కుల్ ప్రీత్‌సింగ్ త‌న కెరీర్, పోటీదారుల గురించి చెప్పుకొచ్చింది. ఎప్పుడో వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ గా ఎదిగి వెలిగిపోతున్న ఈ భామకు ఈ మధ్య ఛాన్స్ లు తగ్గాయి.

    Also Read: రీమేక్ లపై పవన్ ఆరాటం !

    తనకు ఛాన్స్ లు రాకపోయినా.. త‌న స్థానాన్ని స్థిర‌ప‌ర‌చుకున్న రకుల్ అంచెలంచెలుగా ఇంకా ఎదుగుతూనే ఉంది. అయితే ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా ఆమె నెమ్మ‌దించార‌నే వార్త‌లొస్తున్నాయి కాబట్టి.. ఈ వార్తల పై ర‌కుల్ ప్రీత్‌సింగ్ స్పందిస్తూ.. సినిమా ఇండ‌స్ట్రీలో ఫ‌లానా వాళ్లు నెంబ‌ర్ వ‌న్‌, నెంబ‌ర్ టూ, నెంబ‌ర్ త్రీ అనే నంబర్స్ పై నాకు పెద్ద‌గా న‌మ్మ‌కం లేదు. సినిమా హిట్ట‌యితే అదే నిజ‌మైన గెలుపు, ఇక నేను ఎప్పుడూ వాస్త‌వాలేంటో గ్ర‌హించి, అందుకు త‌గ్గ‌ట్టుగానే బ‌త‌క‌డానికి ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే, విజ‌యం సొంత‌మైన‌ప్పుడు పొంగిపోవ‌డం, అప‌జ‌య‌మైతే కుంగిపోవ‌డం లాంటివి నా జీవితంలో ఉండవు అని చెప్పుకొచ్చింది.

    Also Read: వందకోట్లు కోసం బాలయ్య తిప్పలు !

    ఇక జ‌యాప‌జ‌యాల‌ను స‌మానంగా స్వీక‌రిస్తాన‌ని ర‌కుల్ తెలిపారు. త‌న‌లోని క్రియేటివిటీని సంతృప్తిప‌రిచే వైవిధ్యమైన‌ పాత్ర‌ల్లో న‌టించాల‌నేది తన అభిమ‌త‌మ‌న్నారు. అన్నిటికి మించి త‌న‌కు పోటీ తానే అని భావిస్తాన‌న్నారు. అంతే త‌ప్ప‌, ఇత‌రుల‌తో పోల్చుకుని పోటీగా ఎప్ప‌టికీ భావించ‌న‌ని ఇలా రకుల్ చెప్పుకుంటూ పోయింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ .. గత కొన్ని రోజులుగా నేషనల్ వైడ్‌ గా హాట్ టాపిక్ అయిన సెలెబ్రిటీ లిస్ట్‌లో ఉందనే సంగతి తెలిసిందే. ఓ దశలో రకుల్ కూడా డ్రగ్ కేసులో చిక్కుకుందనే ఆరోపణలు చాల బలంగా వినిపించాయి. ఎట్టకేలకు వాటి నుండి బయటపడింది అనుకోండి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్