https://oktelugu.com/

అరె.. పూర్తిగా మారిపోయిన స్టార్ దర్శకుడు !

కరోనా.. ఎవరికీ ఎలా నష్టం చేసినా.. క్రియేటివ్ పర్సన్స్ కు మాత్రం మేలు చేసింది. ముఖ్యంగా లాక్‌ డౌన్ టైమ్‌లో మన దర్శకరచయితలు తమ పనితనం పై ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, అలాగే తమను తాము మెరుగుపరుచుకోవడానికి బాగా ఉపయోగపడింది. ఇక వర్క్ విషయంలో కూడా తమ రెగ్యులర్ పద్ధతులను మార్చుకోవడానికి కూడా లాక్ డౌన్ బాగా పనికొచ్చింది. మెయిన్ గా విదేశీ చిత్రాలు, సిరీస్‌లు, దేశీయ సిరీస్‌లు, పరభాషా చిత్రాలు చూస్తే తాము ఎంతటి మూస […]

Written By:
  • admin
  • , Updated On : January 10, 2021 / 07:17 PM IST
    Follow us on


    కరోనా.. ఎవరికీ ఎలా నష్టం చేసినా.. క్రియేటివ్ పర్సన్స్ కు మాత్రం మేలు చేసింది. ముఖ్యంగా లాక్‌ డౌన్ టైమ్‌లో మన దర్శకరచయితలు తమ పనితనం పై ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, అలాగే తమను తాము మెరుగుపరుచుకోవడానికి బాగా ఉపయోగపడింది. ఇక వర్క్ విషయంలో కూడా తమ రెగ్యులర్ పద్ధతులను మార్చుకోవడానికి కూడా లాక్ డౌన్ బాగా పనికొచ్చింది. మెయిన్ గా విదేశీ చిత్రాలు, సిరీస్‌లు, దేశీయ సిరీస్‌లు, పరభాషా చిత్రాలు చూస్తే తాము ఎంతటి మూస సినిమాలను చేస్తున్నామనేది మన తెలుగు దర్శకులు బాగా అర్ధం చేసుకున్నారట.

    Also Read: రీమేక్ లపై పవన్ ఆరాటం !

    అందుకే ఇక నుండి కొత్త తరహా కథలను తీయాలని నిర్ణయించుకున్నారు మనోళ్లు. వాళ్లల్లో దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఒకరు. ఒకవిధంగా త్రివిక్రమ్ ఖలేజా తర్వాత కొత్త ఆలోచనలతో సినిమాలు చేయడం ఎప్పుడో మానేశాడు. అందుకే ఆయనకు గత కొన్ని సినిమాలుగా కాపీ క్యాట్ అనే ముద్ర కూడా పడింది. హిట్లు అయితే వచ్చాయి గానీ, త్రివిక్రమ్ కు ఉన్న మంచి పేరు మాత్రం పోయింది. ఎక్కువుగా పాత సినిమాల నుండి ఫ్యామిలీ కథలను ఎంచుకుంటూ.. వాటిని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇన్నాళ్లు బండి లాక్కోస్తోన్న త్రివిక్రమ్, లాక్ డౌన్ లో మాత్రం తనను తానూ పూర్తిగా మార్చుకున్నాడట.

    Also Read: వందకోట్లు కోసం బాలయ్య తిప్పలు !

    ఇక నుండి తన సినిమాల విషయంలో త్రివిక్రమ్ కంఫర్ట్ జోన్ విడిచి పెట్టబోతున్నాడట. ముఖ్యంగా తానూ ఇక నుండి యూనివర్సల్ అప్పీల్ వున్న కథలను మాత్రమే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడట. అదేవిధంగా దక్షిణాది దర్శకులకు బాలీవుడ్‌లో డిమాండ్ బాగా వుండడంతో.. త్రివిక్రమ్ కూడా తన రాబోయే సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా మార్చాలని ఫుల్ ఫోకస్ పెట్టాడట. అందుకే, త్వరలో ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాని భారీ పాన్ ఇండియా సినిమాగా మలచబోతున్నాడు త్రివిక్రమ్. మొత్తానికి త్రివిక్రమ్ పూర్తిగా మారిపోయాడు అన్నమాట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్