కేసీఆర్ కాస్కో.. దుబ్బాక జయంతో దూసుకొస్తున్న బీజేపీ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా ఉప ఎన్నిక వచ్చినా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దే. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన ఆరేళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎదురు లేకుండా ప్రతీ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు అర్థమవుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో విజయం కోసం […]

Written By: NARESH, Updated On : November 10, 2020 4:41 pm
Follow us on

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా ఉప ఎన్నిక వచ్చినా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దే. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన ఆరేళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎదురు లేకుండా ప్రతీ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు అర్థమవుతోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో విజయం కోసం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం చేశాయి. అయితే నేడు జరిగిన దుబ్బాక ఎన్నికల్లో రిజల్ట్ మాత్రం ఉత్కంఠను తలపించింది. రౌండ్ రౌండ్ కు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నరాల తెగే ఉత్కంఠను తలపించింది.

తొలి నుంచి బీజేపీ అన్ని రౌండ్లలో మెజార్టీని సాధిస్తూ పోయింది. టీఆర్ఎస్ కూడా అనుహ్యంగా కొన్ని రౌండ్లో బీజేపీని వెనక్కి నెడుతూ మెజార్టీని తగ్గిస్తూ వచ్చింది. దీంతో చివరి రౌండ్ వరకు విజయం ఎవరిదీ అనే ఉత్కంఠగా సాగింది. 23 రౌండ్ పూర్తయ్యే వరకు కూడా గెలుపు టీఆర్ఎస్.. బీజేపీ మధ్య దోబుచులాట ఆడింది.

23వ రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థి రఘునందన్ 1,118ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలిసారి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చెక్ పెట్టి బీజేపీ పార్టీ చరిత్ర సృష్టించింది. 2020 మ్యాచ్ ను తలపించేలా కొనసాగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి మైలేజ్ పెంచగా.. టీఆర్ఎస్ హవాకు తెలంగాణలో గండికొట్టింది. దుబ్బాక ఫలితం రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు పడే అవకాశం కన్పిస్తోంది.

దుబ్బాకలో టీఆర్ఎస్ కు గట్టి షాకిచ్చిన విధంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ మెజార్టీ సీట్లు సాధించాలని భావిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనేలా కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి బీజేపీ జెడ్ స్పీడుతో ప్రజాక్షేత్రంలో దూసుకెళుతుంది. తెలంగాణలో బీజేపీ ఇలానే పుంజుకుంటే మాత్రం 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ ఈ ఫలితాన్ని టీఆర్ఎస్ సమీక్షించుకొని ముందుకెళుతుందో లేదో వేచిచూడాల్సిందే..!