సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’. కాగా ఈ సినిమా షూటింగ్ ను అధికారికంగా ప్రకటించేలోపే అంతలో లాక్ డౌన్ వచ్చి పడింది. దీంతో ఎప్పుడో మొదలుకావాల్సిన చిత్రీకరణ మొదలుకాలేదు. ఇక ఈ మధ్య అందరూ తమ సినిమాల షూట్ లో బిజీగా ఉండటంతో మహేష్ కూడా షూట్ కి రెడీ అని క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే లాక్ డౌన్ సడలింపులు తర్వాత స్టార్ట్ చేయాలని చూసినా వీసా సమస్యల కారణంగా షూట్ వాయిదాపడుతూ వచ్చింది. ఎందుకంటే కథ ప్రకారం సినిమాలోని కొంత భాగం తప్పనిసరిగా అమెరికాలోనే షూట్ చేయాలి. పైగా అమెరికా షెడ్యూల్ కోసమే మహేష్ కొత్త లుక్ లోకి మారాడు.
Also Read: ఉపాసనకు రష్మిక మద్దతు..!
ఇప్పుడు అమెరికా షెడ్యూల్ కాకుండా వేరే సీన్స్ తీస్తే.. మహేష్ ఎంతో కష్టపడి మార్చుకున్న లుక్ ను వృధాగా మళ్లీ మార్చుకోవాల్సి వస్తోంది. అందుకే హైదరాబాద్లో షూటింగ్ చేయవచ్చని పరశురామ్ ప్లాన్ చేసుకుని కూడా, మహేష్ ఏమంటాడో అని మళ్ళీ ఆగిపోయాడు. కానీ మహేష్ ఈ విషయంలో డైరెక్టర్ కి క్లారిటీ ఇచ్చాడు. తన లుక్ కోసం అని అమెరికా షెడ్యూల్ కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు అని.. ఎలాగూ కరోనా ప్రభావం ఇంకా కొంత ఉంది కాబట్టి విదేశాలకు వెళ్లి షూటింగ్ చేయడం ఇప్పుడు కుదిరే పని కాదు కాబట్టి.. వేరే సీన్స్ ను షూట్ పెట్టుకుందాం అని మహేష్ చెప్పాడట. ప్రస్తుతం మహేష్ తాజాగా కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్ళాడు.
Also Read: ప్రభాస్ ‘రాముడి’ పిక్ వైరల్.. దర్శకుడి ఫిదా..!
మహేష్ రాగానే రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ ను ప్లాన్ చేస్తున్నాడు పరుశురామ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించనుంది. ఇక ‘సర్కారు వారి పాట’లో విలన్ గా మొదట కన్నడ హీరో ఉపేంద్రను అనుకున్నారు. ఉపేంద్ర అయితే బాగుంటుందని మహేష్ కూడా ఫీల్ అయ్యాడు. కానీ స్టార్ హీరోగా కొనసాగుతున్న నేను, విలన్ గా చేయడం ఏమిటి.. సారీ అంటూ ఉపేంద్ర మొత్తానికి మహేష్ సినిమాని అంగీకరించలేదు. దాంతో తమిళ్ మాజీ హీరో అరవింద స్వామి విలన్ పాత్ర చేయడానికి అంగీకరించాడని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్