ఈ విషయం కొద్దిసేపు పక్కన పెడితే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ వెలిగిపోతుందని రాసిన ఇదే ‘ఆంధ్రజ్యోతి’ బాబు అధికారం పొగొట్టుకోగానే విషం చిమ్మేలా కథనాలు ప్రచురితం చేసిందని బీజేపీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు గుప్పించారు.
టీటీడీ పరువుకు భంగం కలిగేలా.. ఏపీలో మత విదేష్వాలు రెచ్చగొట్టేలా ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ఉన్నాయని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. అంతేకాకుండా ఆంధ్రజ్యోతి విష ప్రచారాలపై మండిపడుతూ ఏకంగా ఆ సంస్థపై ఏకంగా వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు. తాను గతంలో పరువు నష్టం కేసుల్లో ఎప్పుడు ఓడిపోలేదని, ఆంధ్రజ్యోతి నుంచి వంద కోట్ల రూపాయలు కక్కించడం ఖాయమని ఆయన హెచ్చరించారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ఆయన అధికారంలో లేనప్పుడు ఒకలా వార్తలు వడ్డిస్తున్న ఆంధ్రజ్యోతి కథనాలను సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా తప్పుబట్టారు. ఇటువంటి కథనాలపై గతంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆంధ్రజ్యోతిని హెచ్చరించిన తీరు మార్చుకోకపోవడంతో ఆయన పరువు నష్టం కేసు వేసినట్లు తెలుస్తోంది.
సుబ్రహ్మణ్యం సవాల్ చూస్తుంటే ఆంధ్రజ్యోతి నుంచి వంద కోట్లు వసూలు చేయడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే ఈ వంద కోట్లను ‘ఆంధ్రజ్యోతి’ బాబు నుంచి వసూలు చేసి ఇస్తుందా? లేదా తన జేబులోంచే చెల్లిస్తుందా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.