
సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో జరుగుతున్న ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గాన్ని చేజిక్కిచ్చుకునేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ గెలిచేందుకు వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపించేందుకు బీజేపీ అగ్రనేతలందరూ ఇక్కడ ప్రచారం చేసేందుకు వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ లాంటివారు పర్యటించి ప్రచారంలో ఊపు తెచ్చారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
రాష్ట్రంలో ఒక్కే ఒక్క ఎమ్మెల్యే సీటు ఉన్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు దక్కడంతో పార్టీకి బలం చేకూరింది. దీంతో నలుగు ఎంపీలు రోజుకొకరు ఇక్కడ పర్యటన చేస్తున్నారు. టీఆర్‌ఎస్ వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తూ.. కేంద్రంలో మోదీ ప్రవేశపెడుతున్న పథకాలపై కమలం నాయకులు ఆశలు కల్పిస్తున్నారు. ఇక మరో పార్టీ కాంగ్రెస్ ప్రచారం అంతంతమాత్రంగానే ఉండడంతో రెండో ప్లేసులో ఉన్నామని భావిస్తున్న బీజేపీ ఇక్కడ గెలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.
Also Read: కవిత ఎంట్రీ.. మంత్రి పదవి సంగతేంటి?
గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌కు అధిస్టానం జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షపదవి కట్టబెట్టింది. ఈ పదవి పొందిన తరువాత నిన్న హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనను పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. దీంతో ఆయన శుక్రవారం దుబ్బాకలో పర్యటించనున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఈరోజు దుబ్బాకలో ప్రచారం చేయనున్నారు. ఇక ఎంపీలు మరోసారి పర్యటించే అవకాశం ఉంది.
Also Read: కేటీఆర్ దృష్టిలో అసలు రేవంత్ లీడర్ కాదా? హాట్ కామెంట్స్
నవంబర్ 1న ప్రచారం ముగియనుండంతో మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో ఈ కొద్ది సమయంలో ప్రచారం ఉధృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. కేసీఆర్ వ్యూహాలు బాగా తెలిసిన జితేందర్‌రెడ్డికి దుబ్బాక ప్రచార బాధ్యతలు అప్పగించడంతో ఆయన మారుతున్న సమీకరణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ ఎన్నికలో కనుక బీజేపీ గెలిస్తే త్వరలో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ పార్టీకి లాభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.