ఏపీ రాజకీయాలను మార్చేసిన ఘనత నిజంగానే బీజేపీది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ వల్లే అధికార వైసీపీ అధినేత, సీఎం జగన్ పంచె, లుంగి కట్టుకొని తిరునామాలు పెట్టుకొని గోపూజలు సైతం చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇక ఎన్నడూ గుడులు, గోపురాలకు వెళ్లని నాస్తికవాది చంద్రబాబుతో హిందుత్వ ఎజెండాను పట్టుకునేలా చేసిన ఘనత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీదేననడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: అమ్మఒడి డబ్బులు జమైన వారికి అలర్ట్.. చేయకూడని తప్పు ఇదే..?
ఈ క్రమంలోనే ఏపీలో బీజేపీకి దూకుడుగా రాజకీయాలు చేసేందుకు అవకాశం కలుగుతోంది. అధికార వైసీపీతోపాటు విపక్ష టీడీపీ కూడా తమ అజెండాలను కూడా అంతే వేగంగా మార్చుకోక తప్పడం లేదు.
మొన్నటివరకు బీజేపీని ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అస్సలు లెక్కలోకి తీసుకోలేదు. ఇప్పుడు అనివార్యంగా కాషాయరంగు పులుముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఏడాది కాలంగా ఏపీలో వరుసగా చోటుచేసుకుంటున్న ఆలయాల ఘటనలు చూసీ చూడనట్లుగా వదిలేసిన వైసీపీ ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటోంది. సెక్యులర్ పార్టీగా ముద్రపడిన చంద్రబాబు సైతం ఇప్పుడు విధిలోనే పరిస్థితుల్లో బీజేపీ బాటలోనే నడవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఏపీలో చంద్రబాబు ఓడిపోవడం.. బలమైన వైసీపీని ఎదుర్కోవడానికి చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో చెలిమికి అర్రులు చాస్తున్నారు. అయితే బీజేపీ పట్టించుకోకున్నా.. ఆ పార్టీ బలపడకుండా ఆ పార్టీ హిందుత్వ సిద్ధాంతాన్ని ఓన్ చేసుకుంటోంది. తనకు అలవాటు లేని హిందుత్వ ఎజెండాతో కాషాయనేతలను మెప్పించే ప్రయత్నం చేస్తోంది.
Also Read: బ్యాంక్ అకౌంట్ మొబైల్ నంబర్ మార్చుకోవాలా..? ఎలా అంటే..?
ఇక ఆలయాలపై దాడులు.. హిందుత్వ వ్యతిరేకిగా జగన్ పై అపనిందలు పడడంతో క్రిస్టియన్ అయిన జగన్ ఆత్మరక్షణలో పడిపోయాడు. ఓవైపు బీజేపీ, మరోవైపు టీడీపీ అదే అస్త్రంతో ముప్పేట దాడి చేస్తుండడంతో సీఎం జగన్ సైతం తప్పనిసరి పరిస్థితుల్లో గుళ్లు, గోపురాల వెంట పడుతున్నాడు. గతంలో టీటీడీ ఆలయాలకే పరిమితమైన జగన్ ఇప్పుడు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలకు వెళుతూ గోపూజను సైతం చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
ఇప్పుడు ఏపీ రాజకీయం మొత్తం బీజేపీ వైపు నడుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ బీజేపీ ట్రాప్ లో వైసీపీ, టీడీపీ పూర్తిగా పడిపోయాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్