సంక్రాంతి పండగ అంటేనే సందడి. అందులోనూ మన రెండు తెలుగువాళ్లకు సినిమాలే పెద్ద పండుగ. తెలుగోడు అమెరికాలో ఉన్నా ఆఫ్రికాలో ఉన్నా వాడి హంగామా అంతా సినిమాల పైనే. అందుకే, సంక్రాంతికి ఎంత లేదన్నా మూడు నాలుగు పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. కంటెంట్ బాగుంటే నాలుగు సినిమాలు విడుదలైనా కలెక్షన్స్ కు ఎలాంటి ఢోకా ఉండదని గతంలోనూ అనేకసార్లు ప్రూవ్ అయింది. అందుకే, ఈ సారి సంక్రాంతి మరింత స్పెషల్ గా ఉండబోతోందనుకున్నారు. ఎందుకంటే సినిమాలకు చాల గ్యాప్ వచ్చింది, ఇక కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి అనేది చాలమంది అభిప్రాయం మొన్నటివరకూ.
Also Read: గిల్డ్ పెద్దలూ.. ఈ లోపు సినిమా చచ్చిపోతుంది ?
కానీ ఆ అభిప్రాయం నిజం కాదని తేలిపోయింది. “క్రాక్”, “మాస్టర్” సినిమాలతో పాటు “రెడ్”, “అల్లుడు అదుర్స్” లాంటి సినిమాలు సంక్రాంతికి క్యూ కట్టాయి, కరోనాను దాటుకుని అన్నీ థియేటర్లలోకి కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆమెరికాలో కూడా అన్ని సినిమాలు బాగా రన్ అవుతాయి అనుకున్నారు. ఐతే, ఏ ఒక్క సినిమాకి కూడా అమెరికాలో చెప్పుకోదగ్గ వసూళ్లు రావడం లేదనేది అక్కడ కలెక్షన్స్ ను చూస్తే అర్ధమైపోతుంది. అటు ప్రీమియర్ షోలలో అయినా, ఇటు మామూలు షోలలో అయినా కలెక్షన్స్ లో మాత్రం ఎక్కడా వేరియేషన్ కనిపించడం లేదు.
Also Read: హానీమూన్ కోసం మంచి ప్లేస్ కి వెళ్తాం – సునీత
అసలు ఒకప్పుడు.. అనగా గత ఏడాది వరకూ.. మొదటి మూడు రోజుల్లోనే మిలియన్ డాలర్లు పొందిన సినిమాల్లో మీడియమ్ రేంజ్ సినిమాలు కూడా ఉండేవి. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కూడా ఆ రేంజ్ కనిపించడం లేదు. ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో 1 లక్ష డాలర్లు వస్తే గగనం అన్నట్లుగా మారిపోయింది అక్కడి పరిస్థితి. విడుదలయి ఐదు రోజులు అయినా “క్రాక్” లక్ష డాలర్ల మార్క్ అందుకోలేదు అంటేనే.. కలెక్షన్స్ ఎలా వస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అసలు తమిళ్ నెంబర్ వన్ హీరో విజయ్ వంటి పెద్ద స్టార్ సినిమా “మాస్టర్”కి వచ్చిన ఓపెనింగ్ కూడా అంతంత మాత్రమే. రామ్ “రెడ్”ది అదే బాధ. ఇక “అల్లుడు అదుర్స్” మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేక బెదిరిపోతున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్