కేరళతోపాటు ఉత్తర భారత రాష్ట్రాలను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ కలకలం ఏపీలోనూ చోటుచేసుకుంది. రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే బర్డ్ ఫ్లూతో వందల పక్షులు చనిపోయాయి. కోళ్లకు పాకి వాటిని సంహరించారు.
Also Read: ఆలయాలపై దాడులు..: తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేయాలంట
తాజాగా విశాఖపట్నంలోని డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ సమీపంలోని వందల ఏళ్ల చరిత్రగల చెట్ల మీద నివాసం ఉంటున్న కాకులకు తాజాగా బర్ద్ ఫ్లూ సోకిందన్న వార్త కలకలం రేపింది. ఎందుకంటే ఆ ప్రదేశంలో రెండు కాకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో వాటిని చూసిన జనం ఇవి బర్డ్ ఫ్లై లక్షణాలేనని కంగారు పడుతున్నారు.
చెట్ల మీద నుంచి కాకులు నేల మీద పడిపోతూ మరణించడాన్ని చూసిన జనం హడలి చస్తున్నారు. ఇది బర్డ్ ఫ్లూ అంటూ ప్రచారం చేయడంతో అటువైపే ఎవరూ వెళ్లడం లేదు.
Also Read: దెబ్బకు ఆ ఎస్పీ సెలవు పెట్టి వెళ్లాడు..!
ఈ వార్త తెలిసిన పశువైద్య విభాగం రంగంలోకి దిగి ఈ కాకుల మృతిపై అధ్యయనం చేస్తోంది. బర్డ్ ఫ్లై అని తేలితే ఇక ఏపీలోనూ ఆ మహమ్మారి వ్యాపించినట్టేనన్న భయం వెంటాడుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్