https://oktelugu.com/

ఆలయాలపై దాడులు..: తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేయాలంట

ఆలయాలపై దాడులు జరుగుతోంది ఏపీలో. ఆ కేసును విచారించాల్సింది అక్కడి పోలీసులు. కానీ.. అక్కడి పోలీసులపై నమ్మకం లేకనో కారణం ఏంటో గానీ జనసేన మాత్రం తెలంగాణ పోలీసులతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్‌ చేస్తోంది. ఆ పార్టీ నేత పోలిన మహేశ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై నమ్మకం పోయిందని అన్నారు. Also Read: దెబ్బకు ఆ ఎస్పీ సెలవు పెట్టి వెళ్లాడు..! వందకుపైగా ఘటనలు జరిగినా ఒక్కరంటే.. ఒక్క నిందితుడినీ పట్టుకోవడం దారుణ వైఫల్యమని.. అందుకే తెలంగాణ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 9, 2021 1:34 pm
    Follow us on

    Telangana Police
    ఆలయాలపై దాడులు జరుగుతోంది ఏపీలో. ఆ కేసును విచారించాల్సింది అక్కడి పోలీసులు. కానీ.. అక్కడి పోలీసులపై నమ్మకం లేకనో కారణం ఏంటో గానీ జనసేన మాత్రం తెలంగాణ పోలీసులతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్‌ చేస్తోంది. ఆ పార్టీ నేత పోలిన మహేశ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై నమ్మకం పోయిందని అన్నారు.

    Also Read: దెబ్బకు ఆ ఎస్పీ సెలవు పెట్టి వెళ్లాడు..!

    వందకుపైగా ఘటనలు జరిగినా ఒక్కరంటే.. ఒక్క నిందితుడినీ పట్టుకోవడం దారుణ వైఫల్యమని.. అందుకే తెలంగాణ పోలీసులకు విచారణ బాధ్యతలివ్వాలని ఆయన కోరుతున్నారు. హిందూ ఆలయాలపై దాడుల విషయంలో పోలీసులు రంపం దొరికింది.. లాంటి వివరాలను రోజూ మీడియాకు చెబుతున్నారు. అదుపులో 20 మంది.. 30 మంది అని లీకులిస్తున్నారు. అసలు ఎవరు చేశారు..? ఎందుకు చేశారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.

    అటు ఏపీ పోలీసులు కూడా తేల్చలేకపోతున్నారు. అదే సమయంలో ఈ విగ్రహాల ధ్వంసంపై విచారణ జరుపుతున్న వారందరూ క్రిస్టియన్లేనని విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. సీఎం జగన్ నుంచి రామతీర్థం ఘటనపై విచారణకు నియమించిన సునీల్ కుమార్ వరకూ అందరూ క్రైస్తవలే. అందరూ మత ప్రచారంలో పాల్గొన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో తమకు నమ్మకం లేదన్న ప్రకటనలు విపక్షాల నుంచి వస్తున్నాయి. సీబీఐకి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. జనసేన మాత్రం సెటైరికల్‌గా తెలంగాణ పోలీసులకు ఇవ్వాలని కోరుతోంది.

    Also Read: సుప్రీం కోర్టుకు జగన్‌ : నోటిఫికేషన్‌ వాయిదా పడేనా..?

    గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అదే పనిగా పోలీసులపై విమర్శలు చేసేవారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెలంగాణ పోలీసులకు వైసీపీ నేతలు చేసేవారు. వారు అక్కడ కేసులు నమోదు చేసి ఏపీలో నిందితుల్ని పట్టుకునేవారు. అయితే ఇప్పుడు.. వైసీపీనే అధికారంలోకి వచ్చింది. పోలీసుల పనితీరుపై విపక్షం విమర్శలు చేస్తోంది. అప్పట్లో నమ్మకం లేదన్న వైసీపీ .. ఇప్పుడు పోలీసులు దేశంలోనే అత్యంత సమర్థులని చెబుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్