https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: మూడవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళే….

Bigg Boss 5 Telugu: మొత్తానికి బిగ్ బాస్ మొదలయ్యి పక్షం అయ్యింది. నువ్వా – నేనా అన్నట్టు హోరా హోరీగా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ని కింగ్ నాగార్జున పంపగా ఇప్పటికే ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం “సరయు” ఎలిమినేట్ కాగా, రెండవ వారం ఊహించని పరిణామాల మధ్య “ఉమా దేవి” అత్త ఎలిమినేట్ అయ్యింది. మూడవ వారం నామినేషన్ ప్రక్రియ అత్యంత ఆసక్తి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 20, 2021 / 12:28 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: మొత్తానికి బిగ్ బాస్ మొదలయ్యి పక్షం అయ్యింది. నువ్వా – నేనా అన్నట్టు హోరా హోరీగా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ని కింగ్ నాగార్జున పంపగా ఇప్పటికే ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం “సరయు” ఎలిమినేట్ కాగా, రెండవ వారం ఊహించని పరిణామాల మధ్య “ఉమా దేవి” అత్త ఎలిమినేట్ అయ్యింది.

    మూడవ వారం నామినేషన్ ప్రక్రియ అత్యంత ఆసక్తి రేపుతోంది. చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఇంటి నుండి ఎవరు వెళ్లిపోతున్నారనే విషయం తాజాగా లీక్ అయ్యింది. రేపటి ఎపిసోడ్ ఈరోజే షూటింగ్ చేస్తారు. ఈ క్రమంలోనే ఎవరో లీక్ అయిపోయింది. మూడవ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

    మొదట వారమే నామినేషన్ల ప్రక్రియ వాడి వేడిగా సాగింది. తమకి ఇష్టం లేని కంటెస్టెంట్స్ ని చెత్త కుప్ప లో పడేసి దానికి తగిన కారణాలు చెప్పడం మొదటి వారం నామేషన్స్ ప్రక్రియ. రెండవ వారం రంగు పడిద్ధి అనేది నామినేషన్స్ ప్రక్రియ. మొదటి రెండు వారాల్లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్ మూడవ వారంలో కూడా అంతే రెచ్చిపోయినట్టు తెలుస్తుంది.

    ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మూడవ వారం ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ప్రియాంక సింగ్, మానస్, శ్రీరామ చంద్ర, ప్రియ, లహరి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.