Karthika Deepam: కోర్టుతీర్పుతో మోనితకు షాక్.. 5 లక్షల జరిమానా.. జైలు శిక్ష విధించిన కోర్టు..!

Karthika Deepam: బుల్లితెరపై తీవ్ర ఉత్కంఠతో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ 1149 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఈ ఎపిసోడ్ లో భాగంగా కోర్టులో వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే లాయర్ మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని అడగడంతో… కార్తీక్ అంటుంది మోనిత. మీకు పెళ్లి కాకుండానే ఆ బిడ్డ ఎలా వచ్చాడు? అని లాయర్ అడగడంతో కృత్రిమ గర్భం దాల్చని నిజం ఒప్పుకుంది. ఈ విషయం కార్తీక్ కు తెలుసా […]

Written By: Navya, Updated On : September 20, 2021 12:16 pm
Follow us on

Karthika Deepam: బుల్లితెరపై తీవ్ర ఉత్కంఠతో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ 1149 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఈ ఎపిసోడ్ లో భాగంగా కోర్టులో వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే లాయర్ మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని అడగడంతో… కార్తీక్ అంటుంది మోనిత. మీకు పెళ్లి కాకుండానే ఆ బిడ్డ ఎలా వచ్చాడు? అని లాయర్ అడగడంతో కృత్రిమ గర్భం దాల్చని నిజం ఒప్పుకుంది. ఈ విషయం కార్తీక్ కు తెలుసా అని అడగగా…ఎలాగో పెళ్లి జరుగుతుంది పెళ్లి తర్వాత చెబుదామని వెయిట్ చేశానని చెబుతోంది.

కార్తీక్ దీపను పెళ్లి చేసుకోక ముందే నేను ప్రేమించాను.. కానీ అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ ప్రతి రోజు మా ఇంటికి వచ్చేవాడు. ఇలా రోజు వస్తూ పోతూ ఉంటే సమాజం మా పై నిందలు వేసింది. దానివల్ల ఇల్లు కూడా మారాల్సి వచ్చిందని కట్టుకథలు చెప్పడానికి ప్రయత్నిస్తుండగా దీప అడ్డుపడి కార్తీక్ ను రావద్దని చెప్పాల్సి ఉండేది.డాక్టర్ బాబు అలా రావడం సమాజంలో నీవాడే అనిపించుకోవడం ఇదంతా నీ కుట్రలో భాగంగా అనిపిస్తుందని చెబుతుంది. అలాగే కార్తీక్ మాట్లాడుతూ మేమిద్దరం మంచి స్నేహితులం ఏ రోజు కూడా తనని వేరే దృష్టితో చూడలేదు ఒకానొక సమయంలో మా అమ్మ దీప విషయంలో ఒత్తిడి చేస్తుంటే తనని పెళ్లి చేసుకుంటే నా బాధ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో తనని పెళ్లి చేసుకుంటానని చెప్పానే తప్ప మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోదలుచుకోలేదని కార్తీక్ అంటాడు.

అలాగే కార్తీక్ మాట్లాడుతూ ముమ్మాటికి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేను కాదు అంటూ గట్టిగా అరుస్తాడు…అప్పుడు గతంలో దీప విషయంలో కార్తీక్ చెప్పిన మాటలను గుర్తు చేసుకొని తనను ఓదారుస్తుంది. కార్తీక్ చెప్పిన మాటలను విన్న కోర్టు మీరు ఏమైనా చెప్పదలచుకున్నారా అని మోనిత అడగగా చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాదగా పెరిగిన నాకు కార్తీక్ ఆదరణ చూసి తనని పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండవచ్చుని భావించాను.. తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో మళ్లీ ఒంటరినై అయ్యా.. తను తాళి కడితే చాలని ఇలా గర్భందాల్చనని నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఈ కార్తీక్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా నిజాలు అన్నింటిని ఒప్పుకున్న మోనిత ఈ వాదన విన్న తర్వాత కోర్టు కార్తీక్ నిర్దోషిగా చెబుతూ అతని కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు మోనితకి 5 లక్షల జరిమానా 18 నెలల జైలు శిక్ష విధిస్తుంది.

అలాగే హిమా హత్య కేసులో విచారణ కొనసాగిస్తూ.. వివరాలను కోర్టుకు సమర్పించాలని పోలీసులకు ఆదేశిస్తుంది. కోర్టు తీర్పు విన్న తర్వాత ఏసిపి రోషిని కార్తీక్ దీపకు కంగ్రాట్స్ చెబుతూ..మోనితని జైలుకు తరలించారు.ఇలా జైలుకు తీసుకువెళుతున్న సమయంలో మీడియా తనని అడ్డుకొని వివిధ రకాల ప్రశ్నలు వేస్తారు. వాటికి స్పందించిన మోనిత ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమే క్లైమాక్స్ ముందు ఉందంటూదని తెలియజేస్తుంది. అయితే మోనిత తర్వాత ఏ విధమైనటువంటి ప్లాన్ వేసింది ఏమిటనేది తర్వాత ఎపిసోడ్లో తెలియాల్సి ఉంది.