ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కేంద్రం సుముఖంగా ఉంది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ తరహాలో ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ను కేంద్రం విక్రయించేందుకు సిద్ధంగా ఉంది. దీంతో కేంద్రం నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడవచ్చని సూచనలు వినిపిస్తున్నాయి.
బీసీసీఎల్ కంపెనీని ఇప్పటికే అమ్మకానికి పెట్టారు. దీన్ని కొనేందుకు మూడు విదేశీ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. వేదాంతాతో పాటు అమెరికాకకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, థింక్ గ్యాస్ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయి. బీసీసీఎల్ అమ్మకం పూర్తయితే ఐఓసీ మాత్రమే ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే ఏకైక చమురు రిఫైనింగ్ కంపెనీగా ఉంటుంది. తర్వాత దాన్ని కూడా అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో బడా సంస్థలను అమ్మేందుకే కేంద్రం నిర్ణయించుకుంది.
పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం సమాయత్తం అవుతోంది. అందుకే కంపనీలను అమ్ముకునేందుకు ముందుకు వెళుతోంది. ఇప్పటికే పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్రం మాత్రం నియంత్రణ లేకుండా చేస్తోంది. దీంతో సామాన్య జనం కుదేలైపోతున్నారు. దీంతో ధరలు మాత్రం ఆకాశానికి చేరుకున్నాయి.
కేంద్రం నిర్ణయంతో ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ధరల పెరుగుదలతో దినదిన గండంగా మారుతోంది. ఇన్నాళ్లుగా దిగిరాని ధరలు ఇప్పుడు ఎలా అని దిగులు చెందుతున్నారు. పూటగడవడమే కష్టంగా భావిస్తున్నారు. ప్రభుత్వ విధానాలతో ఇంకా ఏం ఇబ్బందులు వస్తాయో అని మధనపడుతున్నారు.