https://oktelugu.com/

టోక్యో ఒలింపిక్స్: సెమీస్ కు చేరిన సింధు

గత ఒలింపిక్స్ లో రజతంతో మెరిసిన భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు మరోసారి సెమీస్ కు చేరింది. తాజాగా జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ లో ఆమె జపాన్ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. దాంతో మరోసారి భారత్ కు పతకం ఖాయం చేసేలా కనిపిస్తోంది. తొలి గేమ్ లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన ఆమె రెండో గేమ్ లో నూ సత్తా చాటింది. రెండో గేమ్ తొలి విరామానికి సింధు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 30, 2021 / 03:03 PM IST
    Follow us on

    గత ఒలింపిక్స్ లో రజతంతో మెరిసిన భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు మరోసారి సెమీస్ కు చేరింది. తాజాగా జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ లో ఆమె జపాన్ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. దాంతో మరోసారి భారత్ కు పతకం ఖాయం చేసేలా కనిపిస్తోంది. తొలి గేమ్ లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన ఆమె రెండో గేమ్ లో నూ సత్తా చాటింది. రెండో గేమ్ తొలి విరామానికి సింధు 11-6 తో ఆధిపత్యం సాధించింది. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో గేమ్ లో 22-20 తో సింధు నెగ్గింది.