దేశంలోని 135 కోట్ల జనాభాలో దాదాపు 100 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నవాళ్లలో ఎక్కువమంది తరచూ బ్యాంకు లావాదేవీలు జరుపుతుంటారు. మీకు ఆగష్టు నెలలో బ్యాంకు పనులు ఉంటే వెంటనే సెలవులపై అవగాహన కలిగి ఉంటే మంచిది. ఆగష్టు నెలలో ఏకంగా 10 రోజులు సెలవు దినాలుగా ఉండటం గమనార్హం. జూన్, జులై నెలలో బ్యాంకు సెలవులు ఎక్కువగా లేవనే సంగతి తెలిసిందే.
చెక్ క్లియరెన్స్, రుణాలు పొందే వాళ్లు పొందేవాళ్లు మాత్రం బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది. ఆన్ లైన్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు నిర్వహించే వాళ్లకు ఇబ్బందులు లేకపోయినా మిగిలిన వాళ్లు మాత్రం బ్యాంక్ సెలవుల గురించి అవగాహనను కలిగి ఉండాలి. ఆగష్టులో మొత్తం 31 రోజులు ఉండగా ఆగష్టు 1వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు దినంగా ఉంది.
ఆగష్టు 8వ తేదీన కూడా రెండో ఆదివారం కావడంతో సెలవు దినంగా ఉంది. ఆగష్టు నెల 13వ తేదీన ఇంఫాల్ జోన్‌లో మాత్రం బ్యాంకు సెలవు కాగా మిగిలిన ప్రాంతాల్లో బ్యాంకులు పని చేస్తాయి. ఆగష్టు 14 రెండో శనివారం కాగా ఆగష్టు 15వ తేదీ ఆదివారం కావడం, స్వాతంత్ర దినోత్సవం కావడంతో సెలవు దినంగా ఉంది. ఆగష్టు 16వ తేదీ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో సెలవు దినంగా ఉంది.
ఆగష్టు 19వ తేదీన మొహర్రం పండుగ సందర్భంగా సెలవుదినం కాగా ఆగష్టు 20వ తేదీన ఓనం కారణంగా సెలవు దినంగా ఉంది. ఆగష్టు 22 ఆదివారం సెలవు దినం కాగా ఆగష్టు 28 నాలుగో శనివారం సెలవుగా ఉంది. ఆగష్టు 29 ఆదివారం సెలవు కాగా ఆగష్టు 30 జన్మాష్టమి, ఆగష్టు 31 కృష్ణాష్టమి కావడంతో హైదరాబాద్ లో బ్యాంక్ సెలవుగా ఉంది.