https://oktelugu.com/

అటు కేసీఆర్.. ఇటు జగన్ కు షాకిస్తున్న బండి సంజయ్

దూకుడు సినిమాలో మహేష్ బాబును మించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చిపోతూనే ఉన్నాడు. తెలంగాణలో అపర చాణక్యుడు అయిన కేసీఆర్ కే రెండు ఎన్నికల్లో షాకిచ్చి దూకుడుకు పర్యాయపదంగా నిలిచారు. ఏకంగా పాతబస్తీకి వెళ్లి చార్మినార్ ముందు తొడగొట్టే బండి సంజయ్ ధైర్యం ఇప్పుడు బీజేపీ శ్రేణులకు గొప్ప ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలను బండి సంజయ్ చేశారు. అటు కేసీఆర్ ను.. ఇటు జగన్ కు హెచ్చరికలు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2021 / 05:25 PM IST
    Follow us on

    దూకుడు సినిమాలో మహేష్ బాబును మించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చిపోతూనే ఉన్నాడు. తెలంగాణలో అపర చాణక్యుడు అయిన కేసీఆర్ కే రెండు ఎన్నికల్లో షాకిచ్చి దూకుడుకు పర్యాయపదంగా నిలిచారు. ఏకంగా పాతబస్తీకి వెళ్లి చార్మినార్ ముందు తొడగొట్టే బండి సంజయ్ ధైర్యం ఇప్పుడు బీజేపీ శ్రేణులకు గొప్ప ఉత్సాహాన్ని ఇస్తోంది.

    ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలను బండి సంజయ్ చేశారు. అటు కేసీఆర్ ను.. ఇటు జగన్ కు హెచ్చరికలు పంపారు. తెలంగాణలో ఉద్యమకారులు కనుమరుగయ్యారని.. కేసీఆర్ పంచన చేరిన వాళ్లు అంతా తెలంగాణ ద్రోహులేనని.. ఇక తెలంగాణ సెంటిమెంట్ రాష్ట్రంలో పనిచేయదని బండి అన్నారు. ఇదే కేసీఆర్ ఓటమికి అసలు కారణం అని విశ్లేషించారు.

    ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాలపై కూడా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ షాక్ ట్రీట్ మెంట్ తప్పదని సంజయ్ హెచ్చరించాడు.బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కితే మూటముల్లె సర్దుకోవాలన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని.. దుబ్బాక, జీహెచ్ఎంసీలోలా తిరుపతిలోనూ అధికార పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చాడు.

    దీన్ని బట్టి బండి సంజయ్ చూపు తెలంగాణపైనే కాదు.. ఏపీపైనా కూడా వచ్చిందని అర్థమవుతోంది. ఇన్నాళ్లు ఏపీ రాజకీయాలను పట్టించుకోని.. ప్రస్తావించని బండి సంజయ్ ఇప్పుడు నేరుగా విమర్శలు చేయడం చూస్తే ఏపీలోనూ బండి కాలు పెట్టడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కేసీఆర్ కు ఫెయిల్యూర్ ను రూచిచూపించిన బండి ఏపీలో జగన్ కు కూడా అదే పని చేస్తారా? సోము వీర్రాజు తో కలిసి స్కెచ్ గీస్తారా? అన్నది వేచిచూడాలి.