బైక్ నడిపే వాళ్లలో చాలామంది హెల్మెట్ లేకుండానే వాహనాన్ని నడుపుతూ ఉంటారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపకూడదని తెలిసినా నిబంధనలను పాటించడానికి కొంతమంది వాహనదారులు ఇష్టపడటం లేదు. ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నా కొందరు వాహనదారులు తీరు మార్చుకోకపోవడంతో సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హెల్మెట్ లేకుండా బైక్ నడపటానికి వీల్లేని విధంగా అధికారులు నిబంధనలలో మార్పులు చేశారు.
Also Read: ఒక రూంలో ఇద్దరు అమ్మాయిలు.. ముగ్గురు అబ్బాయిలు.. ‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ కథ
అధికారులు C కమిషనరేట్ పరిధిలో మొత్తం ఏడు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇకపై హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వాహనదారులకు పోలీసులు హెల్మెట్ చూపిస్తే మాత్రమే బైక్ ను ఇస్తారు. నోటీసులు పంపడం, చలానాలు రాయడం చేయకుండా బైక్ పై వెళ్లేవాళ్లు నిబంధనలను పాటించాలని ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చారు. హెల్మెట్ లేకపోవడం వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదని భావించి అధికారులు ఈ నిబంధనలను అమలు చేస్తున్నారని సమాచారం.
Also Read: చిన్నారులపై ఆన్ లైన్ క్లాసుల ప్రభావం.. విద్యార్థులలో ఆ సమస్యలు..?
రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా అధికారులు ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది నిబంధనలలో చేసిన మార్పుల వల్ల ఏకంగా 27 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని.. ఈ ప్రమాదాలను మరింత తగ్గించడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు పని చేస్తున్నారని తెలుస్తోంది. హెల్మెట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలు పోయే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని ట్రాఫిస్ పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనం ముందు కూర్చున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని.. ఐఎస్‌ఐ మార్కు ఉన్న హెల్మెట్ ను మాత్రమే వాహనదారులు కొనుగోలు చేయాలని చెబుతున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసేవారికి రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తామని పోలీసులు వెల్లడిస్తున్నారు.