Homeఅత్యంత ప్రజాదరణబాలయ్య చిత్రంలో బోలెడన్ని విశేషాలు

బాలయ్య చిత్రంలో బోలెడన్ని విశేషాలు


బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 106 వ చిత్రం ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఫినిష్ చేసింది. తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావం తో షూటింగ్ ని ఆపేసింది.
కాగా.. తాజా సమాచారం మేరకు ఈసినిమాలో ఓ లేడీ విలన్ నటించనుందని తెలిసింది.

గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ , వెంకటేశ్, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు ల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన భూమిక ఇప్పటి వరకు బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించలేదు. బాలయ్య గత చిత్రం `రూలర్లో ` ఓ కీలక పాత్రలో మాత్రమే కనపడింది. ఇప్పుడు మరోసారి బాలయ్య సినిమాలో వాంప్ (లేడీ విలన్) పాత్రలో కనపడనుంది.

.” సింహా, లెజెండ్ ” చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ మూడో చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించ నున్నారు అయితే బాలయ్య ఈ సినిమాలో కవలలుగా నటించబోతున్నారట. అందులో ఒక క్యారెక్టర్ విలన్ అని.. హీరో క్యారెక్టర్ కి, విలన్ క్యారెక్టర్ కి మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్రానికి హైలెట్ కానుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో హీరో ఎవరు ? విలన్ ఎవరు ? అనే కోణంలో వచ్చే సస్పెన్స్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. కాగా ఈ సినిమాలో శ్రియా శరణ్ ఓ ప్రత్యేక పాత్ర కోసం ఎంపిక కాగా హీరోయిన్ గా అంజలి నటిస్తోంది .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version