https://oktelugu.com/

బీజేపీని బుట్టలో వేసేందుకు బాబు రాజకీయం

రాజకీయాల్లో పట్టువదలని విక్రమార్కుడిలా పోల్చాలంటే అందులో చంద్రబాబు కూడా ఒకరు. ఏం సాధించాలనే ఆయన ఆ స్థాయిలోనే ఆలోచిస్తుంటారు. ఆ పట్టుదల ఉండే నాయకులు కూడా చాలా తక్కువ మందే కనిపిస్తుంటారు. గతంలో ఆయన సీఎం హోదాలో అందించిన సేవలు కానీ.. పార్టీని గాడిన పెట్టిన క్షణాలు కానీ చూస్తుంటే ఎవరికైనా అర్థమవుతుంది. ఏదైనా ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంటారు. ఇంతలా కేరింగ్‌ తీసుకునే బాబు గత ఎన్నికల్లో డక్కీమొక్కీలు తిన్నారు. ఘోర పరాభవం చవిచూశారు. అయితే.. ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 / 03:19 PM IST
    Follow us on

    రాజకీయాల్లో పట్టువదలని విక్రమార్కుడిలా పోల్చాలంటే అందులో చంద్రబాబు కూడా ఒకరు. ఏం సాధించాలనే ఆయన ఆ స్థాయిలోనే ఆలోచిస్తుంటారు. ఆ పట్టుదల ఉండే నాయకులు కూడా చాలా తక్కువ మందే కనిపిస్తుంటారు. గతంలో ఆయన సీఎం హోదాలో అందించిన సేవలు కానీ.. పార్టీని గాడిన పెట్టిన క్షణాలు కానీ చూస్తుంటే ఎవరికైనా అర్థమవుతుంది. ఏదైనా ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంటారు. ఇంతలా కేరింగ్‌ తీసుకునే బాబు గత ఎన్నికల్లో డక్కీమొక్కీలు తిన్నారు. ఘోర పరాభవం చవిచూశారు. అయితే.. ఇప్పుడు ఆయన తాజా బీజేపీతో పొత్తు విషయంలో మదన పడుతున్నారంట.

    Also Read: ఇసుక పాలసీ పేరిట ఈ కుప్పిగంతులేలా?

    2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పార్టీ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు కూడా సాధించగలిగారు. కేంద్రం అటు ఏపీ బీజేపీ నేతలకూ మంత్రి పదవులు ఇచ్చింది. అయితే 2017 చివరి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ప్రత్యేక హోదా, పోలవరం నిధులు వంటి విషయాల్లో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 2019 నాటి ఎన్నికల్లో బీజేపీకి దూరమయ్యారు. ఎప్పుడు దీనిపై చర్చ జరిగినా.. బీజేపీకి దూరంగా ఉండకుండా ఉంటే బాగుండేదనే అభిప్రాయం పార్టీలోనూ వినిపిస్తోందట.

    అందుకే.. మరోసారి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు ఏడాది కిందట నుంచే ప్రారంభించారట. తన పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు నలుగురూ బీజేపీలో చేరడం వెనుక బాబు వ్యూహమే ఉందని అంటున్నారు. అది ఏపాటి నిజమో కానీ.. బాబు తరచుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వీటన్నింటినీ చూస్తుంటే మళ్లీ ఆయన బీజేపీ జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లే అర్థమవుతోంది. కానీ.. ఇప్పుడు బీజేపీ మనసంతా జగన్ చుట్టూ తిరుగుతోంది. అయినా బాబు మాత్రం ప్రయత్నాలను వీడడం లేదు.

    Also Read: దీక్షిత్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో సంచలన నిజాలు

    ఇదిలా ఉండగా.. నిన్న గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పుట్టినరోజు. ఈ సందర్భంగా అమిత్‌షాకు చంద్రబాబు ఫోన్ ద్వారా బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా కేంద్రంలో మరో మంత్రి బాబుకు స్నేహితుడైన పీయూష్ గోయల్‌కు కూడా చంద్రబాబు ఫోన్ చేశారు. పీయూష్ గోయెల్ కిడ్నీలో రాళ్ల తొలగింపు ఆపరేషన్‌ చేయించుకోగా.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఈ పరామర్శల వెనుక బాబు వ్యూహం బీజేపీకి చేరువ కావడమేనన్నది అర్థమవుతోంది. మరి చంద్రబాబు చేస్తున్న ఈ కుటిల రాజకీయాలను బీజేపీ ఎంత వరకు నమ్ముతుంది..? మరోసారి టీడీపీతో జతకట్టేందుకు అంగీకరిస్తుందా..? లేదా అనేది ఆసక్తిగా ఉంది.