పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారాడు. బాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘పింక్’ను తెలుగులో ‘వకీల్ సాబ్’గా తీసుకొస్తున్నాడు. ఈ మూవీ ఇప్పటికే చివరిదశకు చేరుకుంది. సంక్రాంతి రేసులో ‘వకీల్ సాబ్’ మూవీ ఉందనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళి మార్క్ ట్విస్ట్.. అదేనట..!
ఈ మూవీ తర్వాత పవన్ కల్యాణ్ డైరెక్టర్ క్రిష్ తో.. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ లతో కలిసి పని చేయనున్నాడు. ఈ రెండింటితోపాటు ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలు లైన్లో ఉండగానే పవన్ మరో సినిమాకు కమిట్ అవడం ఆసక్తిని రేపుతోంది.
మలయాళంలో ‘అయ్యప్పన్ కోషియమ్’ చిత్రం సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు పలువురు దర్శక, నిర్మాతలు ముందుకొచ్చారు. తొలుత ఈ మూవీ బాలయ్య.. రవితేజల వద్దకు వెళ్లగా చివరకు పవన్..రానా వద్దకు వచ్చి చేరింది. ఈ మూవీలో నటించేందుకు రానా దగ్గుబాటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ సినిమా దర్శకుల విషయంలోనూ హరీష్ శంకర్.. బాబీల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తొలి నుంచి రీమేక్ స్క్రీప్ట్ పనులు చేస్తున్న సాగరే చివరికీ దర్శకుడిగా ఫిక్స్ అయినట్లు టాక్ విన్పిస్తోంది. పవన్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఉత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ఇప్పటికే వెంకటేష్ తో కలిసి ‘గోపాలగోపాల’ మూవీ చేశాడు.
Also Read: పొరపాటును సరిద్దిదుకొని.. ప్రభాస్ కు విషెస్ చెప్పిన మహేష్..!
తాజాగా వెంకటేష్ కొడుకు రానాతో కూడా పవన్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. పవన్-రానా కాంబో సెట్ కావడంతో చిత్రయూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగే దసరాకే మూవీపై ఓ ప్రకటన రానుందని సమాచారం.