ఆస్ట్రేలియాతో 2వ టెస్టు: జట్టులోకి ‘ఆ నలుగురు’

తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టుకు భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. ఓడిపోతే ఇక టీమిండియా ఇజ్జత్ పోవడం ఖాయం కావడంతో సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అవుతోంది. సిరీస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన బాక్సింగ్ టెస్టు మ్యాచ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాకు అంత ఈజీగా పరిస్థితులు లేవు. కీలకమైన కెప్టెన్ కోహ్లీ పితృత్వ సెలవులతో తన భార్య డెలవరీ కోసం ఇండియాకు వెళుతున్నారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ […]

Written By: NARESH, Updated On : December 21, 2020 7:21 pm
Follow us on

తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టుకు భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. ఓడిపోతే ఇక టీమిండియా ఇజ్జత్ పోవడం ఖాయం కావడంతో సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అవుతోంది. సిరీస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన బాక్సింగ్ టెస్టు మ్యాచ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాకు అంత ఈజీగా పరిస్థితులు లేవు.

కీలకమైన కెప్టెన్ కోహ్లీ పితృత్వ సెలవులతో తన భార్య డెలవరీ కోసం ఇండియాకు వెళుతున్నారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో టీమిండియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

ఈ క్రమంలోనే టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. కోహ్లీ ప్లేసులో కేఎల్ రాహుల్ టెస్టు జట్టులోకి రావడం ఖాయంగా తెలుస్తోంది. కేఎల్ రాహుల్ తోపాటు రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్, మహ్మద్ సిరాజ్ లు జట్టులోకి రావడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

ఇక తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన ఫృథ్వీషా, కీపర్ వృద్ధిమాన్ సాహాలు జట్టులో చోటు కోల్పోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. గాయంతో వైదొలిగిన షమీ ప్లేసులో సిరాజ్ టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఇక ఫృథ్వీ షా ప్లేసులో శుభ్ మన్ గిల్ కూడా తొలి టెస్టు ఆడనున్నాడు. సాహా బదులుగా పంత్, కోహ్లీ బదులుగా కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. అయితే బౌలింగ్ లో అనుభవ లేమి ‘సిరాజ్’కు మైనస్ గా మారే అవకాశం ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ లలో కూడా అతడు పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది.. రెండో టెస్టులో టీమిండియా గెలుస్తుందా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది.