https://oktelugu.com/

బిగ్ బాస్-4: ‘ఇమ్యూనిటినీ’ కోల్పోయిన కంటెస్టెంట్లు..!

బిగ్ బాస్ నాలుగో సీజన్ గత మూడు సీజన్ల కంటే భిన్నంగా కొనసాగుతోంది. కరోనా టైంలోనూ బిగ్ బాస్-4 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే 8వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం 9వ వారంలో కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టులు ఎలిమినేటై హౌస్ నుంచి బయటికి వెళ్లడంతో రోజురోజుకు గేమ్ రసవత్తరంగా మారుతోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ప్రతీవారం నామినేషన్ ప్రక్రియ ఒకేరోజు సాగగా.. 9వ వారం మాత్రం రెండ్రోజులు జరిగింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2020 / 12:22 PM IST
    Follow us on

    బిగ్ బాస్ నాలుగో సీజన్ గత మూడు సీజన్ల కంటే భిన్నంగా కొనసాగుతోంది. కరోనా టైంలోనూ బిగ్ బాస్-4 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే 8వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం 9వ వారంలో కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టులు ఎలిమినేటై హౌస్ నుంచి బయటికి వెళ్లడంతో రోజురోజుకు గేమ్ రసవత్తరంగా మారుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ప్రతీవారం నామినేషన్ ప్రక్రియ ఒకేరోజు సాగగా.. 9వ వారం మాత్రం రెండ్రోజులు జరిగింది. ఈ వారం నామినేషన్లో అభిజిత్.. మొనాల్.. అఖిల్.. అమ్మ రాజశేఖర్.. హరిక.. అనివాష్ ఉన్నారు. వీరిలో ఒకరు సేఫ్ అయ్యేందుకు బిగ్ బాస్ ‘ఇమ్యూనిటీ’ ఆఫర్ ఇచ్చాడు. ఇమ్యూనిటీ పొందిన కంటెస్టెంట్ నామినేషన్ నుంచి సేఫ్ అవుతాడని ప్రకటించాడు. అయితే ఇది ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందని తెలిపాడు.

    Also Read: సినిమా రివ్యూ: ‘మిస్ ఇండియా’ టాక్ ఏంటంటే?

    ఇమ్యూనిటీ టాస్కులో భాగంగా నామినేట్ అయిన కంటెస్టెంట్లు టీ స్టాండ్ పై ముఖం పెట్టి బజర్ మోగేంత వరకు ఉంచాలి. చివరి వరకు ఎవరైతే ఉంటారో వారే సేఫ్ అయినట్లు. ఇక మిగిలిన హౌస్ మేట్స్ నామినేట్ అయిన వారిపై ఐస్ గడ్డలు.. నీళ్లు.. గడ్డి.. మట్టి వంటివి మొఖంపై పోస్తూ ఇబ్బంది పెడుతుంటారు. ఇందులో మోనాల్ ను మిగిలిన కంటెస్టెంట్లు ఎక్కువగా హింసించడంతో అఖిల్ చలించి పోయి ఆమె దగ్గరకు వెళ్లి ఆమె ముఖాన్ని శుభ్రం చేస్తాడు.

    Also Read: బిగ్ బాస్-4: ఆ నలుగురిది ఓ బ్యాచ్.. మండిపడుతున్న నెటిజన్లు..!

    దీంతో సొహైల్ కలుగజేసుకొని అఖిల్ తో వాగ్వావాదానికి దిగుతాడు. గతంలో మోహబూబ్.. మాస్టర్ సాయం చేస్తే ఎందుకు వ్యతిరేకించావని సొహైల్ అఖిల్ ను నిలదీస్తాడు. దీంతో వీరిద్దరు కొట్టుకునే వారు వెళ్లారు. అయితే బజర్ మోగేవరకు కూడా మోనాల్.. అవినాష్.. అమ్మ రాజశేఖర్ టీ స్టాండ్ పై తలపెట్టి ఉన్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది కంటెస్టెంట్లు చివరి వరకు ఉండటంతో ఎవరీ కూడా ఇమ్యూనిటీ లభించలేదు. దీంతో బిగ్ బాస్ ఆఫర్ ఎవరికీ దక్కకుండా పోయింది.