https://oktelugu.com/

డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా.. చేయకూడని తప్పులివే..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో డిజిటల్ చెల్లింపుల విషయంలో కొత్త నిర్ణయాలను అమలులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. నగదు లావాదేవీల ద్వారా కరోనా బారిన పడే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో పట్టణాలతో పాటు పల్లెల్లో సైతం ప్రజలు డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యతనిస్తున్నారు. Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బస్ కండక్టర్లకు బాడీ కెమెరాలు..? డిజిటల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2020 / 07:37 PM IST
    Follow us on


    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో డిజిటల్ చెల్లింపుల విషయంలో కొత్త నిర్ణయాలను అమలులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. నగదు లావాదేవీల ద్వారా కరోనా బారిన పడే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో పట్టణాలతో పాటు పల్లెల్లో సైతం ప్రజలు డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యతనిస్తున్నారు.

    Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బస్ కండక్టర్లకు బాడీ కెమెరాలు..?

    డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలు, ఈ మాండేట్ లకు గతంతో పోలిస్తే పరిమితిని భారీగా పెంచింది. 2021 జనవరి 1వ తేదీ నుంచి కాంటాక్ట్ లెస్ లావాదేవీలపై పరిమితి 5,000 రూపాయలకు పెరిగింది. అయితే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల సైబర్ మోసాలు సైతం పెరిగే అవకాశం ఉందని గతంతో పోలిస్తే ఖాతాదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

    Also Read: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఎలా యాక్టివేట్ చేయాలంటే..?

    ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ద్వారా దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరగడంతో పాటు ఖాతాదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే కొన్ని తప్పులు చేస్తే మాత్రం ఖాతాల్లోని నగదు మాయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం లావాదేవీల కోసం వినియోగించే కార్డును ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు ఇతరులకు ఆ కార్డును ఎట్టి పరిస్థితుల్లోను ఇవ్వకూడదు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    మొబైల్ ఫోన్ల ద్వారా లావాదేవీలు చేసేవాళ్లు ఫోన్ కు బలమైన పాస్ వర్డ్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఏదైన కారణం వల్ల కార్డ్ మిస్ అయితే ఆ కార్డును వెంటనే బ్లాక్ చేయించాలి. కార్డ్, యూపీఐ ఐడీ, పిన్ వివరాలను ఎవరితో పంచుకోకూడదు. పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర, మాల్స్ దగ్గర లావాదేవీలను నిదానంగా జరపడం మంచిది.