https://oktelugu.com/

కరోనా బారినపడ్డ స్టార్ హీరోయిన్

సినిమా షూటింగ్ లు అలా ప్రారంభమయ్యాయో లేదో ఇలా కరోనా వారిని అటాక్ చేస్తూనే ఉంది. షూటింగ్ లకు వెళ్లాలంటేనే సినీ నటీనటులు వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. వరుసగా అందరూ కరోనా బారినపడుతున్నారు. ఇటీవలే షూటింగ్ లకు హాజరైన హీరో వరుణ్ ధావన్, నీతు కపూర్, దర్శకుడు రాజ్ మెహతా కరోనా బారినపడ్డారు. తాజాగా ప్రముఖ కథానాయిక ‘వన్ -నేనొక్కడినే’ తో తెలుగులో మహేష్ పక్కన నటించిన కృతి సనన్ సైతం కరోనా బారినపడింది. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2020 / 07:46 PM IST
    Follow us on

    సినిమా షూటింగ్ లు అలా ప్రారంభమయ్యాయో లేదో ఇలా కరోనా వారిని అటాక్ చేస్తూనే ఉంది. షూటింగ్ లకు వెళ్లాలంటేనే సినీ నటీనటులు వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. వరుసగా అందరూ కరోనా బారినపడుతున్నారు. ఇటీవలే షూటింగ్ లకు హాజరైన హీరో వరుణ్ ధావన్, నీతు కపూర్, దర్శకుడు రాజ్ మెహతా కరోనా బారినపడ్డారు. తాజాగా ప్రముఖ కథానాయిక ‘వన్ -నేనొక్కడినే’ తో తెలుగులో మహేష్ పక్కన నటించిన కృతి సనన్ సైతం కరోనా బారినపడింది.

    Also Read: నిహారిక జంట వీడియో వైరల్.. షూట్ చేసింది ఆ దర్శకుడే !

    బాలీవుడ్ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.. సినిమా షూటింగ్స్ తిరిగి ఇటీవలే ప్రారంభం అయ్యాయి. దీంతో సినీ హీరోలు, హీరోయిన్లు బయటకు వచ్చి ఇందులో పాల్గొంటున్నారు. అయితే సినిమా సెట్స్ లలో తగినన్ని జాగ్రత్తలను దర్శక నిర్మాతలు తీసుకోకపోవడంతో నటీనటులు కరోనా బారినపడుతున్నారు.

    తాజాగా షూటింగ్ కు హాజరైన హీరోయిన్ కృతి సనన్ కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. హిందీలో తెరకెక్కుతున్న‘రాజ్ కుమార్ రావ్’ సినిమా షూటింగ్ నిమిత్తం చండీఘర్ వెళ్లిన కృతి షెడ్యూల్ పూర్తికావడంతో ఆదివారం ముంబైకి చేరింది.ముంబైకి వచ్చిన కృతి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది.

    Also Read: ఉప్పెన’ రిలీజ్ ఎప్పుడంటే… అది మెగా ఇమేజ్ కే సాధ్యం !

    కృతికి ఎక్కడ ఎలా కరోనా సోకిందో తెలియడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఆమె షూటింగ్ లో పాల్గొన్న చిత్రం బృందం సభ్యులు ఇప్పుడు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. కృతి ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్