మన నిత్య జీవితంలో రేషన్ కార్డుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అయితే కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు తప్పనిసరిగా 5 విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ 5 విషయాలను గుర్తుంచుకోకుండా దరఖాస్తు చేస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రేషన్ కార్డుకు దరఖాస్తు చేయాలంటే మొదట మనం ఏ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నాం..? ఆ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి సరైన ధృవపత్రాలు మన దగ్గర ఉన్నాయా…? లేవా..? అనే విషయాలను గుర్తుంచుకోవాలని. ప్రస్తుతం బీపీఎల్, ఏపీఎల్, ఏఏవై, ఏవై పేర్లతో నాలుగు రకాల కార్డులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులకు రేషన్ కార్డులను జారీ చేస్తాయి.
ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్లు తక్కువ ధరకే రేషన్ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. రేషన్ డీలర్ల ద్వారా సులువుగా రేషన్ పొందవచ్చు. మన ఆధార్ నంబర్ ను రేషన్ నంబర్ కు తప్పకుండా లింక్ చేసుకోవాలి. రేషన్ కార్డ్ కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వ గుర్తింపు కార్డులతో ఆదాయ ధృవీకరణ్ అపత్రం కూడా అవసరమవుతుంది.
సరైన ధృవపత్రాలను ఇవ్వడం ద్వారా తక్కువ సమయంలో రేషన్ కార్డును పొందే అవకాశం ఉంటుంది. ఫోటోలు, గ్యాస్ కనెక్షన్ బిల్లు, బ్యాంక్ స్టేట్ మెంట్లు కూడా అడ్రస్ ఫ్రూప్ గా సహాయపడతాయి. రేషన్ కార్డు దరఖాస్తులో సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.