https://oktelugu.com/

రాములమ్మా.. చల్లబడమ్మా..!

తెలంగాణ ఫైర్ బ్రాండ్ , కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరుతున్నారని.. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి మరీ దౌత్యం నిర్వహిస్తున్నాడన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ అలెర్ట్ అయ్యింది. ఆమెను కాంగ్రెస్ లోనే ఉంచేందుకు టీపీసీసీ రంగంలోకి దిగింది. Also Read: దుబ్బాక విజేతను డిసైడ్ చేసేది మహిళలే! కొంతకాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతిని బుజ్జగించేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ ఆమె […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 8:19 pm
    Follow us on

    vijayasanthi to join bjp

    తెలంగాణ ఫైర్ బ్రాండ్ , కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరుతున్నారని.. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి మరీ దౌత్యం నిర్వహిస్తున్నాడన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ అలెర్ట్ అయ్యింది. ఆమెను కాంగ్రెస్ లోనే ఉంచేందుకు టీపీసీసీ రంగంలోకి దిగింది.

    Also Read: దుబ్బాక విజేతను డిసైడ్ చేసేది మహిళలే!

    కొంతకాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతిని బుజ్జగించేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ ఆమె ఇంటికి వెళ్లారు. రాములమ్మతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

    దుబ్బాక ఎన్నికల వేళ విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ పెడచెవిన పెట్టిందని.. ఆమె అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే విజయశాంతిని బీజేపీలోకి చేర్చుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది దుబ్బాకలో తమకు లాభిస్తుందని కమలదళం భావిస్తోంది. గతంలో మెదక్ ఎంపీ, మెదక్ ఎమ్మెల్యేగా విజయశాంతి పోటీచేశారు. ఆమెకు క్యాడర్, ప్రజా బలం ఉంది. విజయశాంతి ప్రభావం దుబ్బాకలోనూ ఉంటుంది. పైగా రాములమ్మకు సినీ గ్లామర్, రాజకీయ అనుభవం ఉంది. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి ఆమెతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఇప్పటికే బండి సంజయ్ కూడా ఆమెను కలిసినట్టు తెలిసింది.

    Also Read: ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీచేస్తాం: జనసేన

    అధికార టీఆర్ఎస్ పై రాములమ్మ నిప్పులు చెరుగుతున్నారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ కాంగ్రెస్ తరుఫున పల్లెత్తు మాట కూడా మాట్లాడడం లేదు. కాంగ్రెస్ తరుఫున దుబ్బాక ఎన్నికల ప్రచారానికి రావడం లేదు. దీంతో ఆమె ఫేంను క్యాష్ చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీలో ఉంటే విజయశాంతి మరింత ఫైర్ బ్రాండ్ గా ఉంటారని.. టీఆర్ఎస్ ను ఇరుకునపెడుతారని కమలదళం భావిస్తోంది.

    విజయశాంతి బీజేపీలోకి వెళ్లకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. మరి రాములమ్మ బీజేపీలోకి వెళ్తారా? లేక కాంగ్రెస్ లోనే కొనసాగుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. విజయశాంతి బీజేపీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం విశేషం.