ఏపీ సీఎం జగన్ భారీ నిర్ణయాలు తీసుకున్నారు. అధికారవర్గాలను షేక్ చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీవిరమణ సందర్భంగా సీఎం జగన్ కొత్త సీఎస్ ను నియామకం చేశారు. అధికార వర్గాల్లో ముగ్గురు నలుగురు రేసులో ఉండగా.. ఎవరిని చేస్తారోనన్న ఉత్కంఠ నేపథ్యంలో సీఎం జగన్ మొత్తానికి ఏపీ కొత్త సీఎస్ ను ఎంపిక చేశారు. అలాగే భారీగా బదిలీలు చేసి ప్రక్షాళన చేశారు.
Also Read: జగన్ ను మళ్లీ ఇరికించిన ఉండవల్లి అరుణ్ కుమార్
కొత్త సీఎస్ ఎంపిక సందర్భంగా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన శాఖల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేసింది.
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాధ్ దాస్ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్ గా కొనసాగుతున్న నీలం సాహ్ని పదవీకాలం ఈనెల 31తో ముగుస్తోంది. ఇదే క్రమంలో కొత్త సీఎస్ ను సీఎం జగన్ ఫైనల్ చేశారు. అదేరోజు కొత్త ఏపీ సీఎస్ గా ఆదిత్యనాధ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Also Read: బీజేపీ నేతకు సీపీ సజ్జనార్ కౌంటర్..!
తెలంగాణ కేడర్ నుంచి వచ్చి వెయిటింగ్ లో ఉన్న శ్రీలక్ష్మీని జగన్ కీలక పోస్టులో కట్టబెట్టారు. ఏపీ పురపాలక శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మీని నియమించారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కే.సునీత నియమితులయ్యారు. జలవనరుల శాఖ కార్యదర్శిగా శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించారు.
కాగా సీఎస్ గా పదవీ విరమణ చేయనున్న నీలం సాహ్నిని సీఎం ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్