ఏపీ ‘పంచాయితీ’ లొల్లి.. సుప్రీంకోర్టులో సంచలన పరిణామం

ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టుకు ఎక్కింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. అయితే సుప్రీంకోర్టులోనూ తాజాగా సంచలన పరిణామం చోటుచేసుకుంది. Also Read: వింతవ్యాధి కలకలం.. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తన ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, ఓ సుప్రీం జడ్జి ప్రభావితం చేస్తున్నారని ఏకంగా చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన వైనం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ […]

Written By: NARESH, Updated On : January 24, 2021 6:31 pm
Follow us on

ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టుకు ఎక్కింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. అయితే సుప్రీంకోర్టులోనూ తాజాగా సంచలన పరిణామం చోటుచేసుకుంది.

Also Read: వింతవ్యాధి కలకలం..

ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తన ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, ఓ సుప్రీం జడ్జి ప్రభావితం చేస్తున్నారని ఏకంగా చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన వైనం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పంచాయితీ ఎన్నికల వాయిదా పిటీషన్ ను విచారించే ధర్మాసనంను రిజిస్ట్రీ సడెన్ గా ఈరోజు మార్చడం సంచలనమైంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఏపీ పంచాయితీ ఎన్నికలు వాయిదా వేయాలని పీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిపే బెంచ్ మార్చుతూ ఈరోజు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకున్నారు. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జాబితాలో ఈ పిటీషన్ ఉండగా.. తాజాగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేష్ రాయ్ బెంచ్ కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చడం గమనార్హం.

Also Read: రేపటి నుంచే పంచాయతీ నామినేషన్లు.. స్వీకరించమంటున్న ఉద్యోగులు..

దీన్ని బట్టి ఖచ్చితంగా ఢిల్లీలోని సుప్రంకోర్టులో పరిణామాలు మారాయని.. సీఎం జగన్ కు అనుకూలంగా తీర్పు రాబోతోందన్న ప్రచారం సాగుతోంది. రేపు ఉదయం 11 గంటల తర్వాత ఈ పిటీషన్లు విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. రేపు సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇవ్వనుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్