ఏపీ దశ మారనుందా?

సహజసిద్ధమైన నిక్షేపాలు, వనరులు, అవకాశాలు అపారంగా కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు వస్తాయని ఏపీ అంచనా వేస్తోంది. పెట్రో కెమికల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. తీర ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని భావిస్తోంది. పెట్రో కెమికల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ లో భాగంగా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తాయని చెబుతున్నాయి […]

Written By: NARESH, Updated On : December 14, 2020 9:55 am
Follow us on

సహజసిద్ధమైన నిక్షేపాలు, వనరులు, అవకాశాలు అపారంగా కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు వస్తాయని ఏపీ అంచనా వేస్తోంది. పెట్రో కెమికల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

తీర ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని భావిస్తోంది. పెట్రో కెమికల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ లో భాగంగా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తాయని చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ అంచనాలు నిజమైతే రాష్ట్రం దేశానికే పెట్రో కెమికల్ హబ్ కానుంది.

2007లో మొదటగా రూపొందిన పీసీపీఐఆర్ పాలసీ వివిధ సందర్భాల్లో మారుతూ వస్తోంది. తాజాగా 2020-35 పీసీపీఐఆర్ పాలసీని సిద్ధ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పాలసీని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసేందుకు ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది.

ఇప్పటి వరకు 250చదరపు కిలోమీటర్లకు ఓ క్లస్టర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం దాన్ని 50చదరపు కిలోమీటర్లకు కుదించారు. క్లస్టర్ల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

కాకినాడ ఎస్ ఈ జెడ్ సమీపంలో పోర్టు నిర్మాణం చర్యలకు సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. విశాఖ, కాకినాడ, మచిలీ పట్నం ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇప్పటికే విశాఖ పట్టణం జిల్లా నక్కపల్లిలో ఓ భారీ క్లస్టర్ ఏర్పాటు కానుంది. అలాగే కాకినాడ మచిలీపట్నం లాంటి ప్రాంతాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేసేదిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాకినాడ ఎస్ ఈజెడ్ పరిధిలో 11.43బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టేందుకు హల్దియా పెట్రో కెమికల్స్ సంస్థ సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

గెయిల్ భాగస్వామ్యంతో హెచ్ పీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 1.5మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సుముఖ వ్యక్తం చేస్తోంది హెచ్ పీసీఎల్. ఇవన్నీ పూర్తి అయితే నిజంగానే దేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక పెట్రో కెమికల్ హబ్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.