చుక్కలు చూపించిన వెంకీ, వరుణ్ లపై దిల్ రాజు అలా పగతీర్చుకున్నాడా?

2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఎఫ్ 2. విక్టరీ వెంకటేష్, వరుణ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ నిర్మాత దిల్ రాజుకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 ఉంటుందని చాలా కాలం క్రితమే అనిల్ రావిపూడి ప్రకటించడం జరిగింది. నిన్న వెంకటేష్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. Also Read: చైతు ‘లవ్ స్టోరీ’లో కుల […]

Written By: Neelambaram, Updated On : December 14, 2020 7:09 pm
Follow us on

2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఎఫ్ 2. విక్టరీ వెంకటేష్, వరుణ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ నిర్మాత దిల్ రాజుకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 ఉంటుందని చాలా కాలం క్రితమే అనిల్ రావిపూడి ప్రకటించడం జరిగింది. నిన్న వెంకటేష్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.

Also Read: చైతు ‘లవ్ స్టోరీ’లో కుల సమస్య !

డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. ఎఫ్ 2లో పెళ్ళైన మగాళ్లు పెళ్ళాల వలన పడే ఇబ్బందులను కామెడీగా చూపించిన అనిల్ రావిపూడి… ఈసారి డబ్బులు కాన్సెప్ట్ ని కామెడీ కోసం ఎంచుకున్నారు. సరిలేరు నీకెవ్వరు విడుదల తర్వాత… ఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి తన రైటింగ్ టీమ్ తో సొంత ఊరు వెళ్ళాడు అనిల్. లాక్ డౌన్ మొత్తం ఆయన అక్కడే గడిపారు.

Also Read: నారప్పగా వెంకీ అదరగొట్టాడు !

ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా నిర్మాత దిల్ రాజు వెంకీ, వరుణ్ లపై కూడా సెటైర్ వేశారని టాలీవుడ్ టాక్. సీక్వెల్ కావడంతో దర్శకుడు వెంకీ, వరుణ్ లనే మరలా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. దీనిని అవకాశంగా తీసుకొని రెమ్యూనరేషన్ విషయంలో దిల్ రాజుకు చుక్కలు చూపించారట. వెంకటేష్ రూ. 12 కోట్ల వరకు అందుకుంటుండగా… వరుణ్ పట్టుబట్టి రూ. 8 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడట. ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ లో ట్రాలీలలో డబ్బులు తీసుకెళుతున్న వరుణ్, వెంకీలను చూపించి… ఈ చిత్రం ద్వారా గట్టిగా రాబట్టారని దిల్ రాజు సెటైర్ వేశాడని అందరూ అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్