https://oktelugu.com/

‘రైతుబంధు’కు మరొక అవకాశం..!

తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షమమే ధ్యేయంగా పనిచేస్తోంది. మిగిలిన వర్గాలను ప్రభుత్వం  పెద్దగా పట్టించుకోకపోయినా రైతులకు మాత్రం సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేస్తున్నారు. ఈమేరకు రైతులకు అందించే పథకాల విషయంలో ప్రభుత్వ అధికారులు సైతం ఆచితుచి అడుగులు వేస్తున్నారు. Also Read: ఆన్ లైన్ అప్పు.. ఆయువును మింగేస్తుందా? తెలంగాణలోని కొన్ని వర్గాల్లో ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకతలు వస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగులు.. నిరుద్యోగ యువత సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు. ఇక తొలి నుంచి సర్కారుకు అండగా ఉన్న […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 18, 2020 / 11:37 AM IST
    Follow us on

    తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షమమే ధ్యేయంగా పనిచేస్తోంది. మిగిలిన వర్గాలను ప్రభుత్వం  పెద్దగా పట్టించుకోకపోయినా రైతులకు మాత్రం సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేస్తున్నారు. ఈమేరకు రైతులకు అందించే పథకాల విషయంలో ప్రభుత్వ అధికారులు సైతం ఆచితుచి అడుగులు వేస్తున్నారు.

    Also Read: ఆన్ లైన్ అప్పు.. ఆయువును మింగేస్తుందా?

    తెలంగాణలోని కొన్ని వర్గాల్లో ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకతలు వస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగులు.. నిరుద్యోగ యువత సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు. ఇక తొలి నుంచి సర్కారుకు అండగా ఉన్న రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    రైతుల వ్యవసాయ భూముల వివరాలను ఈనెల 10తేదిలోగా ధరణి పోర్టల్లోకి సీసీఎల్ఏ అధికారులు చేర్చారు. దీని ప్రకారంగా ప్రభుత్వం యాసంగి రైతు బంధు సాయం అందించేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే గతంలోని రానివారు.. వివరాలను సరిగాలేని వారు సైతం ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం వారికి మరొక అవకాశం కల్పించింది.

    యాసంగి రైతుబంధు సాయం కోసం రైతులు దరఖాస్తు ఫారంతోపాటు పట్టాదారు పుస్తకం.. ఆధార్‌ కార్డు జిరాక్స్.. బ్యాంక్‌ ఖాతా వివరాలను సంబంధిత ఏఈవోలకు అందజేయాలని పేర్కొంది. ఇదివరకే ఉన్న మార్గదర్శకాలను కొనసాగిస్తున్నామని.. ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    Also Read: తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త.. ఆన్ లైన్ లో టెట్..?

    రైతు బంధు కింద తొలుత ఐదెకరాలలోపు విస్తీర్ణం ఉన్న రైతులకు సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. గత ఏడాది యాసింగిలోనూ బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడం.. ఆధార్​ సమస్యలతో 18.45లక్షల మంది రైతుబంధుకు దూరమయ్యారు. వర్షాకాలంలోనూ 57లక్షల మంది రైతులకు రైతుబంధు సొమ్ము విడుదల చేయగా.. దాదాపు 4.20లక్షల మంది ఖాతాల్లో జమ కాలేదు.

    ఈసారి రైతుల భూముల వివరాలను ధరణి పోర్టల్లో అనుంధానించారు. అయితే వీటిలోనూ 3.81 లక్షల మంది రైతుల వివరాలు ధరిణిలో సరితూగడం లేదని సమాచారం. దీంతో ఈ రైతుందరికీ ప్రభుత్వం ఈనెల 20లోపు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే కొన్ని జిల్లాలో ఈనెల 19వరకే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్