https://oktelugu.com/

ఆ బిగ్ బాస్ బ్యూటీ దశ తిరిగిందట

అత్యంత ప్రజాదరణ కలిగిన రియాలిటీ షోగా బిగ్ బాస్ ఉండగా… ఒక్కసారి హౌస్లోకి ఎంటర్ అయితే ఫేమ్ దక్కడం ఖాయం. ముక్కు మొహం తెలియనివారు కూడా బిగ్ బాస్ షో వలన సెలెబ్రిటీలుగా మారిపోయారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అరియనా, అఖిల్, సోహైల్ పెద్దగా పరిచయం లేని ముఖాలే. కానీ బిగ్ బాస్ షో వాళ్లకు ప్రజల్లో ఆదరణ, ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసింది. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా గుర్తింపు తెచుకున్నవారిలో యంగ్ […]

Written By:
  • admin
  • , Updated On : December 18, 2020 / 11:44 AM IST
    Follow us on


    అత్యంత ప్రజాదరణ కలిగిన రియాలిటీ షోగా బిగ్ బాస్ ఉండగా… ఒక్కసారి హౌస్లోకి ఎంటర్ అయితే ఫేమ్ దక్కడం ఖాయం. ముక్కు మొహం తెలియనివారు కూడా బిగ్ బాస్ షో వలన సెలెబ్రిటీలుగా మారిపోయారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అరియనా, అఖిల్, సోహైల్ పెద్దగా పరిచయం లేని ముఖాలే. కానీ బిగ్ బాస్ షో వాళ్లకు ప్రజల్లో ఆదరణ, ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసింది. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా గుర్తింపు తెచుకున్నవారిలో యంగ్ బ్యూటీ దివి వాద్యా ఒకరు. హీరోయిన్ గా చేసినా… దివి గురించి ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ తరువాత ఆమెకు ఫేమ్ దక్కింది.

    Also Read: సాయి ధరమ్ ని నమ్మొద్దు అంటున్న శిరీష్

    ఏడు వారాలు హౌస్ లో ఉన్న దివి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్నారు. సన్నజాజి తీగలా ఉండే ఈ పొడుగు సుందరి గురించి పరిశ్రమకు తెలిసింది మాత్రం ఈ షో ద్వారానే. ఇక ప్రేక్షకుల అభిమానం కూడా సంపాదించుకున్న దివికి వరుస అవకాశాలు వస్తున్నాయట. తమ సినిమాలలో హీరోయిన్ గా నటించాలని దివిని… దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఓ రెండు ప్రాజెక్ట్స్ దివి కన్ఫర్మ్ చేశారట. వస్తున్న అవకాశాలలో, ఆచితూచి పాత్రలు ఎంచుకుంటుందట దివి. ముఖ్యంగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కోసం తెరకెక్కుతున్న చిన్న బడ్జెట్ చిత్రాలకు ఆమె బెస్ట్ ఛాయిస్ గా మారారట.

    Also Read: టీజర్ టాక్: ఈ ఊరమాస్ ప్రొఫెసర్… సో డేంజరస్

    దివి నటించనున్న సినిమాలలో ఏ ఒక్కటి మంచి విజయం అందుకున్నా… హీరోయిన్ గా ఒక స్థాయికి వెళ్లడం ఖాయం. హైదరాబాద్ కి చెందిన దివి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. 2018లో విడుదలైన లెట్స్ గో అనే ఓ చిత్రంలో దివి హీరోయిన్ గా చేయడం జరిగింది. 2019లో మహేష్, పూజా హెగ్డే జంటగా నటించిన మహర్షి మూవీలో దివి… చిన్న పాత్రలో తళుక్కున మెరిశారు. బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్