https://oktelugu.com/

నటుడు రాజేంద్రప్రసాద్ ను కలిసిన బీజేపీ అధ్యక్షుడు.. ఏంటి కథ?

‘ఆపరేషన్ తెలుగు రాష్ట్రాలు’ మొదలు పెట్టిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో సక్సెస్ కావడంతో అదే ఫార్ములాను ఏపీలో అప్లై చేస్తోంది. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ నటి విజయశాంతి ఇంటికి స్వయంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బం డి సంజయ్ లు వెళ్లి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె ఇప్పుడు చేరారు. ఇక పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించి పార్టీలో చేర్చుకున్నారు. Also Read: అన్నతోని కాలేదు… తమ్ముడైనా సక్సెస్‌ అయితడా..? ఈ క్రమంలోనే ఇదే ప్లాన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2020 / 04:54 PM IST
    Follow us on

    ‘ఆపరేషన్ తెలుగు రాష్ట్రాలు’ మొదలు పెట్టిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో సక్సెస్ కావడంతో అదే ఫార్ములాను ఏపీలో అప్లై చేస్తోంది. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ నటి విజయశాంతి ఇంటికి స్వయంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బం డి సంజయ్ లు వెళ్లి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె ఇప్పుడు చేరారు. ఇక పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించి పార్టీలో చేర్చుకున్నారు.

    Also Read: అన్నతోని కాలేదు… తమ్ముడైనా సక్సెస్‌ అయితడా..?

    ఈ క్రమంలోనే ఇదే ప్లాన్ ను ఇప్పుడు ఏపీలో అమలు చేస్తున్నారు సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు తాజాగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను కలవడం చర్చనీయాంశమైంది. రాజేంద్రప్రసాద్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు సోము వీర్రాజు చెబుతున్నారు. కానీ ఇందులో ఏదో మర్మం దాగి ఉందని అంటున్నారు. రాజేంద్రప్రసాద్ ను సోము వీర్రాజు కలవడం ఏపీలో బీజేపీకి సినీ గ్లామర్ అద్దడమా? లేక మరేదైనా ప్లాన్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

    Also Read: ధర్మాన యాక్టివ్‌… కారణం అదేనా..?

    రాజేంద్రప్రసాద్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోము వీర్రాజు కలిశారు. ఆయన వెంటన నటి హేమ కూడా రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి ఈ భేటి వెనుక ముఖ్య పాత్ర పోషించారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని చూస్తున్న బీజేపీ ఇప్పుడు సినీ గ్లామర్ కోసం పరితపిస్తోంది. తాజాగా తెలంగాణలో బలమైన నాయకురాలు, సినీ నటి విజయశాంతి బీజేపీలో చేరడంతో ఈ ఊపు ఎక్కువైంది.ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా సోము వీర్రాజు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.