https://oktelugu.com/

బీజేపీలోకి రాములమ్మతోపాటు ఆమె కూడా చేరారు? గుర్తుపట్టారా..!

సినీ నటి విజయశాంతి నేడు బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్నిరోజులుగా విజయశాంతి బీజేపీలో చేరుతారనే ప్రచారాన్ని నేడు ఆమె నిజం చేశారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో విజయశాంతి కాషాయ కండువా కప్పుకున్నారు. విజయశాంతిని బీజేపీలోకి అరుణ్ సింగ్ సాదరంగా ఆహ్వానించారు. రాములమ్మతోపాటు మరో ప్రముఖ వ్యక్తి  కూడా నేడు బీజేపీలో చేరారు. అయితే ఆమె మాస్కు పెట్టుకోని ఉండటంతో పెద్దగా ఎవరూ గుర్తుపట్టడం లేదు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 7, 2020 / 04:27 PM IST
    Follow us on

    సినీ నటి విజయశాంతి నేడు బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్నిరోజులుగా విజయశాంతి బీజేపీలో చేరుతారనే ప్రచారాన్ని నేడు ఆమె నిజం చేశారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో విజయశాంతి కాషాయ కండువా కప్పుకున్నారు.

    విజయశాంతిని బీజేపీలోకి అరుణ్ సింగ్ సాదరంగా ఆహ్వానించారు. రాములమ్మతోపాటు మరో ప్రముఖ వ్యక్తి  కూడా నేడు బీజేపీలో చేరారు. అయితే ఆమె మాస్కు పెట్టుకోని ఉండటంతో పెద్దగా ఎవరూ గుర్తుపట్టడం లేదు. ఇంతకీ ఆమె ఎవరంటే.. తెలంగాణ తొలి పైలట్ అజ్మీరా బాబీ. మంచిర్యాలకు చెందిన బాబీ ఎంబీఏ పూర్తి చేసి తన అభిరుచికి అనుగుణంగా ఎయిర్ హోస్టెస్ గా పని చేశారు.

    ఆ తర్వాత పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత పైలట్ గా సేవలందించారు. తెలంగాణ నుంచి తొలి మహిళా పైలట్ గా అజ్మీరా బాబీ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయశాంతిపాటు ఆమె కూడా నేడు ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. ముఖానికి మాస్కు పెట్టుకొని(బ్లూ కలర్ సారీ) విజయశాంతితో పాటు ఉన్నారు. దీంతో ఇంతకీ ఆమె ఎవరా? అని నెటిజన్లు ఆరా తీయడంతో అసలు విషయం బయటికొచ్చింది.

    ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో మంచి జోష్ లో ఉంది. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి సత్తాచాటింది. దీంతో ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈక్రమంలోనే రాములమ్మను బీజేపీలోకి ఆహ్వానించి ఇతర పార్టీల నేతలు గేట్లు ఓపెన్ చేసినట్లు సంకేతాలు పంపించారు. రాములమ్మ రాకతో మరికొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశం కన్పిస్తుంది.