అటు కేసీఆర్.. ఇటు బీజేపీ.. ఇరుక్కుపోయిన పవన్

‘ముందుకు పోతే నుయ్యి.. వెనకకు పోతే గొయ్యి’ అన్నట్లుగా ఉంది జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి. అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీతో అంటకాగుతున్న పవన్‌.. ఇప్పుడు తెలంగాణలోనూ గ్రేటర్‌‌ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపారు. మరో ఐదురోజుల్లో గ్రేటర్‌‌ పోలింగ్‌ జరగనుంది.ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. Also Read: పీసీసీ పదవి ఇస్తేనే కాంగ్రెస్‌లో రేవంత్‌..! అయితే.. జనసేన కూడా గ్రేటర్‌‌ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ […]

Written By: NARESH, Updated On : November 24, 2020 6:05 pm
Follow us on

‘ముందుకు పోతే నుయ్యి.. వెనకకు పోతే గొయ్యి’ అన్నట్లుగా ఉంది జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి. అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీతో అంటకాగుతున్న పవన్‌.. ఇప్పుడు తెలంగాణలోనూ గ్రేటర్‌‌ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపారు. మరో ఐదురోజుల్లో గ్రేటర్‌‌ పోలింగ్‌ జరగనుంది.ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

Also Read: పీసీసీ పదవి ఇస్తేనే కాంగ్రెస్‌లో రేవంత్‌..!

అయితే.. జనసేన కూడా గ్రేటర్‌‌ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ ముందుగా ప్రకటించారు. ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోన‌ని కూడా చెప్పారు. దీంతో ఏపీ జ‌నాలు ఎక్కువ‌గా ఉన్న ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లోని 50 వార్డుల జాబితాను కూడా సిద్ధం చేశారు. ఇంత‌లోనే బీజేపీ అధిష్టానం నుంచి ప‌వ‌న్‌కు పిలుపు వ‌చ్చింది. త‌మ‌కు ప్రచారం చేయాల‌ని వారు ప‌వ‌న్‌ను కోరారు. దీంతో ఈ ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు పవన్‌. అంతేకాదు.. బీజేపీకి ప్రచారం చేస్తాన‌ని ప్రక‌ట‌న ఇచ్చారు.

ఇదంతా జ‌రిగి ప‌ది రోజులు అయింది. కానీ.. ఇప్పటి వ‌ర‌కు ప‌వ‌న్ ముందడుగు వేసింది లేదు. మ‌రోవైపు బీజేపీ నేత‌లు మాత్రం త‌మ‌కు ప‌వ‌న్ వ‌స్తాడు.. ప్రచారం చేస్తాడు అంటూ చంక‌లు గుద్దుకుంటున్నారు. అయితే.. పవన్‌ ప్రచారానికి రావడానికి చాలా చిక్కుముడులు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ సైతం.. ప‌వ‌న్ పోయి పోయి బీజేపీకి ప్రచారం చేయ‌డాన్ని తీవ్రంగా నిర‌సించారట. తాజాగా కొంద‌రు సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్‌ను క‌లిశారు. షూటింగ్  అనుమ‌తుల విష‌యం స‌హా థియేట‌ర్లలో పూర్తిస్థాయిలో ప్రేక్షకుల‌ను అనుమ‌తించే విష‌యంపై చ‌ర్చించారు. ప‌న్నులు మిన‌హాయించాల‌ని కూడా కోరారు. దీనికి కేసీఆర్ సై అన్నారు.

Also Read: అసలు పవన్‌ ప్లాన్‌ ఏంటి..?

ఈ స‌మ‌యంలోనే ఆయ‌న త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌కు చెప్పార‌ని తెలుస్తోంది. ‘మేం మీకు స‌హ‌క‌రిస్తాం. మీ నుంచి కూడా మాకు స‌హ‌కారం ఉండాలి క‌దా.. మీకు మేం ప‌నులు చేస్తుంటే.. మీరు అపోజిష‌న్ పార్టీల‌కు ప్రచారం చేస్తే ఎలా?’ అని ప‌వ‌న్‌ను దృష్టిలో పెట్టుకుని ప‌రోక్ష వ్యాఖ్యలు చేశార‌ట‌. అటు పోయి ఇటు పోయి ఈ వార్త ప‌వ‌న్ చెవిలో ప‌డింది. దీంతో ఆయ‌న ఇప్పుడు ప్రచారం చేయాలా? వ‌ద్దా? అని త‌ల ప‌ట్టుకుంటున్నట్టు సినీ వ‌ర్గాల్లో నడుస్తున్న టాక్‌. బీజేపీకి తాను ప్రచారం చేయ‌క‌పోయినా ఫ‌ర్లేద‌ని.. సినీ ఇండ‌స్ట్రీ విష‌యంలో కేసీఆర్ అనుస‌రిస్తున్న వైఖ‌రి బాగున్న నేప‌థ్యంలో రాజ‌కీయంగా ఆయ‌న‌ను విమర్శిస్తే.. ఇబ్బందేనని ప‌వ‌న్ తాలూకు ఆలోచ‌న‌గా ఉంది. మరి ఈ నేపథ్యంలో పవన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్