https://oktelugu.com/

పీసీసీ పదవి ఇస్తేనే కాంగ్రెస్‌లో రేవంత్‌..!

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికే చాలా మంది నేతలు వలస పోతుండగా.. మరికొందరు వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నారు. అంతేకాదు.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిపోయిన ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధించాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. కానీ.. ఆ నేతకు కాంగ్రెస్‌లో అంతగా ప్రాధాన్యం దక్కడం లేదని సమాచారం. ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2020 6:00 pm
    Follow us on

    Revanth Reddy

    తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికే చాలా మంది నేతలు వలస పోతుండగా.. మరికొందరు వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నారు. అంతేకాదు.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిపోయిన ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధించాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. కానీ.. ఆ నేతకు కాంగ్రెస్‌లో అంతగా ప్రాధాన్యం దక్కడం లేదని సమాచారం. ఇప్పుడు రేవంత్‌పై బీజేపీ నేతల చూపు పడిందట. ఆయన కాంగ్రెస్‌ ను వీడి ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని కాచుకు కూర్చున్నారట.

    Also Read: అసలు పవన్‌ ప్లాన్‌ ఏంటి..?

    రేవంత్‌ను పార్టీలో చేర్చుకుంటే,  అధికారం వైపు రాష్ట్ర నాయకత్వాన్ని నడిపించే విధంగా ఆయన యాక్టివ్ చేయగలరని బీజేపీ నమ్ముతోంది. అయితే.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనపైనే ఆశలు పెట్టుకుంది. మిగిలిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల నుంచి తగిన సహకారం లభించకపోయినా, రేవంత్ సర్దుకుపోతూ వస్తున్నారు. అయితే.. ఆయనకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇచ్చినప్పటికీ తన స్థాయికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి అవసరమని రేవంత్ చాలాకాలంగా భావిస్తున్నారు.

    పార్టీలోని సీనియర్ లీడర్లు పీసీసీ పదవి రాకుండా అడ్డుకోవడంపై రేవంత్ చాలా కాలంగా ఆగ్రహంగా ఉన్నారు  అధిష్టానం తనకే తప్పకుండా ఆ పదవి ఇస్తుందని అభిప్రాయపడుతూ వస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలపడడం, దుబ్బాకలో విజయం సాధించడం వంటి వ్యవహారాలతో, ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.

    Also Read: కేసీఆర్ కు మూడోఫ్రంట్ పై ఎందుకంత ఆరాటం..?

    అందుకే.. ఏయే పార్టీలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారిని తమ పార్టీలో చేరాల్సిందిగా రాయబారాలు పంపుతున్నారు. కీలక పదవులు ఇస్తామని హామీ ఇస్తూ ఉండడంతో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో, ఇక ఆ పార్టీని పట్టుకుని వేలాడితే తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్ లో ఉండాలని,  లేకపోతే బీజేపీలో చేరాలనే అభిప్రాయంతో రేవంత్ ఉన్నట్టుగా సమాచారం. మొత్తంగా బీజేపీలో కనుక రేవంత్‌ చేరితో ఆ పార్టీకి మంచి బూస్టింగ్‌ లాంటి వార్తేనని చెప్పాలి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్