https://oktelugu.com/

ఉత్కంఠ: 7న రాష్ట్రపతితో సీఎం జగన్ అత్యవసర సమావేశం.. ఏం జరుగనుంది?

సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు పెంచుకుంటున్నారు. తరుచూ ఢిల్లీ పర్యటనలు చేస్తూ.. రాష్ట్రానికి అవసరమైన నిధులు.. పనులుపై చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత నెలకొన్న పరిస్థితి.. రాష్ర్టంలో పథకాల గురించి చాలా సార్లు చర్చించారు. అయితే ఈనెల 7న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏపీలో పర్యటించనున్నారు. అది అతడి సొంత షెడ్యూల్ అయినప్పటికీ.. ఏపీ సీఎంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2021 / 02:45 PM IST
    Follow us on

    సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు పెంచుకుంటున్నారు. తరుచూ ఢిల్లీ పర్యటనలు చేస్తూ.. రాష్ట్రానికి అవసరమైన నిధులు.. పనులుపై చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత నెలకొన్న పరిస్థితి.. రాష్ర్టంలో పథకాల గురించి చాలా సార్లు చర్చించారు. అయితే ఈనెల 7న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏపీలో పర్యటించనున్నారు. అది అతడి సొంత షెడ్యూల్ అయినప్పటికీ.. ఏపీ సీఎంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

    షెడ్యూల్లో సీఎం జగన్ తో సమావేశానికి సంబంధించిన సమయాన్ని కూడా కేటాయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. రాష్ట్రపతితో జగన్ సమావేశం ఎందుకు..? ఏఏ అంశాలు చర్చిస్తారు..? రాజకీయంగా ఏమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా..? విపక్షాలపై మరేమైనా బాంబు వేసేందుకా..? రాజధాని మార్పులు.. ఇతర అంశాలేమైనా ఉన్నయా అన్న చర్చ ఏపీలో ప్రస్తుతం జోరుగా సాగుతోంది.

    ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఢిల్లీ పర్యటనకు చాలాసార్లు వెళ్లారు. హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీతో చాలాసార్లు భేటీ అయ్యారు. ఏపీకి మూడు రాజధానుల కేటాయింపు.. హైకోర్టు తరలింపుపై జగన్ ఢిల్లీ పెద్దలతో చాలా సార్లు సమావేశం అయ్యారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా నిధులు విడుదల చేయాలని కోరారు. ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చాలని కోరారు. అదే విధంగా రాష్ట్రానికి కావాల్సిన నిధులు.. పోలవరానికి మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో ఏపీలో నెలకొంటున్న పరిస్థితులు.. తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో సమావేశం అయ్యారు. అయితే అక్కడి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతోనే ఈనెల 7వ తేదీన ఏపీ పర్యటనకు వచ్చే రాష్ట్రపతితో సమావేశం కావాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం.

    అయితే ఇప్పటికే రాష్ట్రపతి షెడ్యూలు ఏపీలో ఖరారు అయ్యింది. ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి రాంనాథ్ కోవిడ్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ లో మదనపల్లెకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలుకుతారు. అందరూ కలిసి రోడ్డు మార్గాన సత్సంగ్ ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ జరిగే శంకుస్థాపన , యోగాకేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సత్సంగ్ విద్యాలయంలో మొక్కలు నాటుతారు. సదుం మండలంలోని ఓ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ షెడ్యూల్ మధ్యలోనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అవుతారని సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న పాలన, మూడు రాజధానులు.. హైకోర్టు తరలింపు… ఇతర అంశాలను సీఎం జగన్ రాష్ట్రపతితో చర్చిస్తారని సమాచారం.