వైసీపీకి రెఫరెండం కానున్న విశాఖ ఎలక్షన్స్

ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 21తో ఇది ముగియగానే 22న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సిద్ధమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న, కోర్టు కేసుల్లో లేని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నగారా మోగబోతోంది. కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నవి జీవీఎంసీ ఎన్నికలే. రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైన గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌లో జరిగే ఈ ఎన్నికలు ఇప్పుడు […]

Written By: Srinivas, Updated On : February 5, 2021 2:32 pm
Follow us on


ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 21తో ఇది ముగియగానే 22న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సిద్ధమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న, కోర్టు కేసుల్లో లేని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నగారా మోగబోతోంది. కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నవి జీవీఎంసీ ఎన్నికలే. రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైన గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌లో జరిగే ఈ ఎన్నికలు ఇప్పుడు అధికార వైసీపీతో పాటు విపక్షాలకూ ఓ సవాల్‌గా మారబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం మూడు రాజధానుల ప్రక్రియే.

Also Read: జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

ఏపీలో మూడు రాజధానుల వ్యూహంతో రాజకీయాధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీ సర్కారుకు త్వరలో జరిగే విశాఖపట్నం కార్పోరేషన్ (జీవీఎంసీ) ఎన్నికలు సవాల్‌ విసురుతున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానుల పేరుతో విశాఖలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీకి ఈ ఎన్నికలు నల్లేరు మీద నడక కాదని తేలిపోతోంది. కోర్టు కేసులతోపాటు ఇతరత్రా కారణాలతో రాజధాని తరలింపు ఆలస్యం కావడం జీవీఎంసీ ఎన్నికల మీద పెను ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. దీంతో చివరి నిమిషంలో వైసీపీ నేతలు జీవీఎంసీ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

విశాఖ నడిబొడ్డున జరిగే ఈ పోరు వైసీపీ సర్కారు మానసపుత్రిక అయిన మూడు రాజధానులకు రెఫరెండంగా మారబోతోంది. ఎందుకంటే రాజధాని ఇచ్చినందుకు విశాఖ ప్రజలు తమను ఆదరిస్తారని వైసీపీ గంపెడాశలు పెట్టుకోగా.. విపక్షాలు కూడా రాజధాని మార్పును ప్రజలు అంగీకరించడం లేదని వాదిస్తున్నాయి. దీంతో ప్రజలు రాజధానికి మద్దతిస్తున్నారా లేక విపక్షాలు చెబుతున్నట్లు రాజధాని అక్కర్లేదా అన్నది తేలిపోనుంది.

Also Read: ఎన్నికల ‘పంచాయితీ’లో ప్రభుత్వ వాదన కరక్టేనా!

జీవీఎంసీ ఎన్నికలపై రాజధాని అత్యంత ఎక్కువ ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం విశాఖను రాజధాని ప్రకటించినా ఇప్పటికీ అక్కడికి తరలింపులు పూర్తి కాలేదు. కనీసం సీఎం క్యాంపు కార్యాలయం కూడా తరలించలేని పరిస్థితుల్లో వైసీపీ కనిపిస్తోంది. దీనికి కోర్టు కేసులే కారణం. కాబట్టి రాజధానే కాదు రాజధాని తరలింపు కూడా ఈ ఎన్నికలపై ప్రభావం చూపబోతోంది. రాజధాని తరలింపులో జరుగుతున్న ఆలస్యంతో విశాఖ ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అది వైసీపీ వైఫల్యంతోనా లేక విపక్షాలు అడ్డుకోవడం వల్లా ఆనేది త్వరలో జరిగే జీవీఎంసీ ఎన్నికల ఫలితాలే చెప్పనున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్