గతేడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. చాలా వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. మన దేశంలో గతేడాది డిసెంబర్ నాటికే ప్రతి ఐదుగురిలో ఒకరికిపైగా కరోనా బారిన పడ్డారట. ఈ మేరకు ఐసీఎంఆర్ నిర్వహించిన సీరోలాజికల్ సర్వే గణాంకాలు తెలిపాయి. ఢిల్లీ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో సీరో సర్వే నిర్వహించగా 21.4 శాతం మందికి కరోనా సోకి తగ్గిపోయి యాంటీ బాడీలు వృద్ధి చెందాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ వెల్లడించారు.
Also Read: జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
10 నుంచి 18 సంవత్సరాల వయసున్న వారిలో 25.3 శాతం మందిలో యాంటీ బాడీలు కనిపించాయని ఈ గణాంకాల ఆధారంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వైరస్ సోకిందన్న నిర్ధారణకు వచ్చామని అన్నారు. ఆగస్టులో జరిపిన సర్వేతో పోలిస్తే కరోనాను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తిని కలిగివున్న వారి సంఖ్య 0.7 శాతం నుంచి 21.4 శాతానికి పెరిగిందని తెలిపారు. 18 సంవత్సరాల కన్నా అధిక వయసున్న వారిలో 21.4 శాతం టీనేజ్‌లో ఉన్న వారిలో 25.3 శాతం పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో ఉంటున్న వారిలో 31.7 శాతం పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 26.2 శాతం గ్రామీణ ప్రాంతాల్లో 19.1 శాతం వరకూ కరోనా రోగ నిరోధక శక్తి ఉందని తమ సర్వేలో తేలిందని రాజేశ్ భూషణ్ తెలియజేశారు.
మొత్తం మీద మగవారిలో 20.3 శాతం ఆడవారిలో 22.7 శాతం మంది కరోనాను ఎదుర్కొన్నారని తెలిపారు. హెల్త్ కేర్ విభాగానికి వస్తే డాక్టర్లు నర్సుల్లో 26.6 శాతం పారామెడికల్ స్టాఫ్ లో 25.4 శాతం ఫీల్డ్ స్టాఫ్ లో 25.3 శాతం అడ్మిన్ స్టాఫ్ లో 24.9 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలకు చెందిన 700 పట్టణాలు గ్రామాల్లో ఈ సర్వే జరిగిందని ఐసీఎంఆర్ వెల్లడించింది. భారత్‌లో ఇంతవరకు 19 కోట్ల 92 లక్షల కరోనా టెస్టులు జరిగితే.. కోటి 8 లక్షల మందికి పాజిటివ్ నిర్ధారణయ్యింది. ఇందులో.. లక్షా 51 వేల మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షా 53 వేల యాక్టివ్ కేసులున్నాయి.
Also Read: ఎన్నికల ‘పంచాయితీ’లో ప్రభుత్వ వాదన కరక్టేనా!
ఇప్పటివరకు కోటి 4 లక్షల మంది రికవరీ అయ్యారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం దేశంలో రోజుకి 12–13 వేల మధ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ ఇవ్వనున్నారు. ఇంతవరకు దాదాపు 46 లక్షల మందికి వ్యాక్సినేషన్ జరిగింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 73.6 శాతం ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తే ఆ తర్వాత స్థానాల్లో 66.8 శాతంతో రాజస్తాన్ 65.5 శాతంతో త్రిపుర నిలిచాయి. 11 రాష్ట్రాల్లో మాత్రం 30 శాతం కంటే తక్కువగా వ్యాక్సినేషన్ జరిగింది.
మరిన్ని జాతీయం రాజకీయ వార్తల కోసం జాతీయం పాలిటిక్స్