ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు బంపర్ మెజార్టీని కట్టబెట్టారు. 151సీట్లతో వైఎస్సాసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఏపీ వికేంద్రకరణ బిల్లుతో సీఎం జగన్ మూడు రాజధానులకు ఆమోదం తెలిపారు.
Also Read: ఏపీలో స్థానిక ఎన్నికలపై జగన్ సర్కార్ కు ఎస్ఈసీ ట్విస్ట్
దీనిలో భాగంగా అమరావతి శాసన రాజధానిగా.. విశాఖ పరిపాలన రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా చేయడానికి జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే ఏపీకే ఒకటే రాజధాని.. అది అమరావతేనంటూ అక్కడి ప్రజలు నిరసనలు.. ఆందోళనలు చేపడుతున్నారు.
అమరావతి రాజధాని ఉద్యమం నేటికి(డిసెంబర్ 17) ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అమరావతే రాజధాని కొనసాగించాలని జనభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తూ రైతులు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించబోతున్నారు.
ఓవైపు రైతులు అమరావతి కోసం ఉద్యమం చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం తనదైన శైలిలో అమరావతి ఉద్యమం.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని అని ముందే నిర్ణయించుకొని టీడీపీ నేతలు ముందుగానే రైతుల నుంచి భూముల కోనుగోలు చేశారని ఆరోపించారు.
Also Read: రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ గా మారుస్తారా..!
మూడు రాజధారుల నిర్ణయంతో అక్కడ భూముల ధరలు పడిపోతున్నాయనే భయంతో టీడీపీ నేతలే అమరావతి ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తప్పుడు బుర్రలోంచి పుట్టిందే అమరావతి ఉద్యమం అంటూ మండిపడ్డారు.
ఒక చెడు బుర్ర ఆలోచిస్తే అలాంటి ఫలితాలు వస్తాయని.. ఒక మంచి బుర్ర(తనది) ఆలోచిస్తే అన్నివర్గాల ప్రజలకు మంచి జరుగుతుందంటూ ‘బీసీ సంక్రాంతి’ సభలో సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్