https://oktelugu.com/

మోడీ సర్కార్ కు షాక్.. వ్యవసాయ చట్టాల అమలు ఆపాలన్న సుప్రీంకోర్టు

కొత్త వ్యవసాయ చట్టాలపై అటు కేంద్రం పట్టు వీడకపోవడం.. ఇటు రైతులు వెనక్కి తగ్గకపోవడంతో దేశ రాజధాని సాక్షిగా రైతుల ఉద్యమం పతాక స్థాయిలో జరుగుతోంది. ఈ ఎడతెగని పంచాయితీకి సుప్రీం కోర్టు చెక్ పెట్టింది. అన్నదాతల ఆందోళనకు మద్దతుగా సంచలన నిర్ణయం తీసుకుంది. గత మూడు వారాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. కేంద్రం చర్చలు జరిపినా.. చట్టాలు సవరిస్తామన్నా రైతులు వెనక్కి తగ్గడం లేదు. చట్టాలు రద్దు చేస్తేనే ఆందోళన విరమిస్తామని అంటున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2020 / 04:22 PM IST
    Follow us on

    కొత్త వ్యవసాయ చట్టాలపై అటు కేంద్రం పట్టు వీడకపోవడం.. ఇటు రైతులు వెనక్కి తగ్గకపోవడంతో దేశ రాజధాని సాక్షిగా రైతుల ఉద్యమం పతాక స్థాయిలో జరుగుతోంది. ఈ ఎడతెగని పంచాయితీకి సుప్రీం కోర్టు చెక్ పెట్టింది. అన్నదాతల ఆందోళనకు మద్దతుగా సంచలన నిర్ణయం తీసుకుంది. గత మూడు వారాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. కేంద్రం చర్చలు జరిపినా.. చట్టాలు సవరిస్తామన్నా రైతులు వెనక్కి తగ్గడం లేదు. చట్టాలు రద్దు చేస్తేనే ఆందోళన విరమిస్తామని అంటున్నారు. దీంతో ఈ పీటముడికి సుప్రీంకోర్టులో చెక్ పడింది.

    Also Read: ఏపీలో స్థానిక ఎన్నికలపై జగన్ సర్కార్ కు ఎస్ఈసీ ట్విస్ట్

    కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ చట్టాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులు వ్యతిరేకిస్తున్న నూతన వ్యవసాయ చట్టాల అమలును ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అయితే వ్యవసాయ చట్టాల అమలును ఆపడం జరిగే పనికాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనికి చీఫ్ జస్టిస్ దయచేసి పరిశీలించాలని.. ఈలోగా రైతు సంఘాలకు నోటీసులు జారీ చేయాలని సూచించారు.

    రైతు సంఘాలు కోర్టుకు హాజరు కాకపోవడంతో వారికి ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ.. ‘వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయడానికి అవకాశాలను పరిశీలించాలని’ కేంద్రానికి సూచించారు.

    Also Read: చెడిపోయిన బుర్రలోంచి పుట్టిందే ‘అమరావతి’..!

    తదుపరి విచారణ వింటర్ వెకేషన్ లో జరుగుతుందని తెలిపారు. వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించేందుకు పిటీషనర్లకు అవకాశం కల్పించారు.

    కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉధృతం అవుతోంది. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపినా ఫలించడంలేదు. దీంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని వ్యవసాయ చట్టాల అమలు ఆపాలని కేంద్రాన్ని కోరింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్