కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు శుభవార్త.. 95 శాతం మందికి..?

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అపోలో గ్రూపు ఆస్పత్రుల తాజా అధ్యయనంలో వ్యాక్సిన్లతో కరోనా వైరస్ కు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని తేలింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 95 శాతం మందికి కరోనా వైరస్ సోకలేదని అపోలో ఆస్పత్రి గ్రూప్ తెలిపింది. 31,621 మంది హెల్త్ కేర్ సిబ్బందిపై అధ్యయం చేసి అపోలో ఆస్పత్రి గ్రూప్ ఈ విషయాలను వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కేవలం 4.28 […]

Written By: Navya, Updated On : June 19, 2021 10:31 am
Follow us on

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అపోలో గ్రూపు ఆస్పత్రుల తాజా అధ్యయనంలో వ్యాక్సిన్లతో కరోనా వైరస్ కు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని తేలింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 95 శాతం మందికి కరోనా వైరస్ సోకలేదని అపోలో ఆస్పత్రి గ్రూప్ తెలిపింది. 31,621 మంది హెల్త్ కేర్ సిబ్బందిపై అధ్యయం చేసి అపోలో ఆస్పత్రి గ్రూప్ ఈ విషయాలను వెల్లడించింది.

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కేవలం 4.28 శాతం మంది స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో ఆస్పత్రులలో చేరారని ముగ్గురికి ఐసీయూ అవసరమైనా వారంతా కోలుకున్నారని కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి ఉన్న సమయంలో ఈ అధ్యయనం జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో ఒక్కరు కూడా మృతి చెందకపోవడం గమనార్హం. మొత్తం 31,621 మందిలో 1,061 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది.

అపోలో ఆస్పత్రుల గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సిన్లను మొదట అందించడం వల్ల హెల్త్ కేర్ సిబ్బంది రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించారని తెలిపారు. సామూహిక టీకా కార్యక్రమం ద్వారా కరోనా థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోవచ్చు. 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ నిర్లక్ష్యం పనికిరాదని కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వచ్చేవరకు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.