https://oktelugu.com/

‘సమంత’ రెండేళ్లు విశ్రాంతి.. పిల్లలు కోసమేనా ?

‘అక్కినేని సమంత’ సినిమా కోసం ఏదైనా చేస్తోంది. పాత్ర డిమాండ్ చేస్తే.. ఇప్పటికీ కూడా బోల్డ్ సీన్స్ చేస్తాను అంటూ సినిమా పై తనకున్న అమూల్యమైన ప్రేమను సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పింది సామ్. అందుకే దర్శక నిర్మాతలు కూడా సమంతతో సోలో మూవీ చేయడానికి తెగ ఉబలాట పడుతున్నారు. ఈ క్రమంలో చేస్తోన్న పాన్ ఇండియా మూవీనే ‘శాకుంతలం’. దీనికితోడు ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ తర్వాత సామ్ కి నార్త్ ఇండియాలో కూడా ఫుల్ […]

Written By:
  • admin
  • , Updated On : June 17, 2021 / 09:39 AM IST
    Follow us on

    ‘అక్కినేని సమంత’ సినిమా కోసం ఏదైనా చేస్తోంది. పాత్ర డిమాండ్ చేస్తే.. ఇప్పటికీ కూడా బోల్డ్ సీన్స్ చేస్తాను అంటూ సినిమా పై తనకున్న అమూల్యమైన ప్రేమను సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పింది సామ్. అందుకే దర్శక నిర్మాతలు కూడా సమంతతో సోలో మూవీ చేయడానికి తెగ ఉబలాట పడుతున్నారు. ఈ క్రమంలో చేస్తోన్న పాన్ ఇండియా మూవీనే ‘శాకుంతలం’.

    దీనికితోడు ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ తర్వాత సామ్ కి నార్త్ ఇండియాలో కూడా ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ క్రేజ్ ను గమనించిన బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో పాటు నెట్ ఫ్లిక్స్ లాంటి బడా ఓటీటీ సంస్థ కూడా సమంతతో వెబ్ సిరీస్ లు, డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమంతకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

    అందుకే, సామ్ ఒక నిర్ణయం తీసుకుంది. ‘శాకుంతలం’ తర్వాత నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో ఒక సిరీస్ చేసి, ఆ తర్వాత రెండేళ్ల పాటు నటనకు గ్యాప్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటుందని, అందుకు తగ్గట్టుగానే తన సన్నిహితుల దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో గాని, పిల్లల కోసమైనా రెండేళ్లు గ్యాప్ తీసుకుంటాను అంటూ అప్పుడెప్పుడో సమంత చెప్పుకొచ్చింది.

    మరి, విశ్రాంతి పేరుతో సామ్ తన జీవితంలో కొత్త వ్యక్తి రాకకు ప్లాన్ చేసి ఉండొచ్చు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శాకుంతలం సినిమాకు సామ్ డేట్స్ ఇచ్చింది. ఈ నెల 25 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మరో రెండు నెలల్లో ఈ సినిమా అయిపోతుంది. ఆ తర్వాత, రెండు నెలలు టైం పెట్టుకుని నందినిరెడ్డి-సోనీ సంస్థ కాంబినేషన్ లో సినిమా చేస్తోందట. ఈ సినిమాతో పాటే ఒకేసారి నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ కోసం కూడా డేట్స్ ఇస్తోందట.