https://oktelugu.com/

అల్లుడు అదుర్స్ రివ్యూ : రెగ్యులర్ సినిమాల సమ్మేళనం !

మూవీ: అల్లుడు అదుర్స్ నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, సోనూసూద్, నభా నటేష్, వెన్నెల కిషోర్ తదితరులు దర్శకత్వం :  సంతోష్ శ్రీనివాస్ సంగీతం :  దేవి శ్రీ ప్రసాద్ ఎడిటర్ : తమ్మి రాజు సినిమాటోగ్రఫర్ : స్క్రీన్ ప్లే : సంతోష్ శ్రీనివాస్ నిర్మాత :  గొర్రెల సుబ్రహ్మణ్యం Also Read: అఖిల్-మోనాల్ బయట కూడా వదలట్లేదుగా? యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా  కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో వచ్చిన ఈ సినిమా విషయానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 14, 2021 / 03:15 PM IST
    Follow us on

    మూవీ: అల్లుడు అదుర్స్

    నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, సోనూసూద్, నభా నటేష్, వెన్నెల కిషోర్ తదితరులు

    దర్శకత్వం :  సంతోష్ శ్రీనివాస్
    సంగీతం :  దేవి శ్రీ ప్రసాద్
    ఎడిటర్ : తమ్మి రాజు
    సినిమాటోగ్రఫర్ :
    స్క్రీన్ ప్లే : సంతోష్ శ్రీనివాస్
    నిర్మాత :  గొర్రెల సుబ్రహ్మణ్యం

    Also Read: అఖిల్-మోనాల్ బయట కూడా వదలట్లేదుగా?

    యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా  కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో వచ్చిన ఈ సినిమా విషయానికి వస్తే.. రెగ్యులర్ పాయింట్‌ తో పాటు రెగ్యులర్ కథతో అలాగే ఫేక్ ఎమోషన్స్, సిల్లీ కామెడీతో తెరకెక్కింది ఈ సినిమా.

    కథ :

    పెద్దగా కథ ఏమి లేదు.  రొటీన్ సినిమాలాగే  ఐదు ఫైట్స్, మాస్ సాంగ్స్ తో పక్కా కమర్షియల్ చిత్రంలానే సాగుతూ చివరకు బోర్ గా సాగుతుంది. అయినా సింపుల్ గా చెప్పుకుంటే.. శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) చిన్నతనంలోనే వసుంధరా రెడ్డి (అనూ ఇమాన్యుల్)ను ప్రేమించి పెద్దయ్యాక కౌముది (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వీళ్ల జీవితంలోకి గజా (సోనూసూద్) ఎంట్రీ ఇస్తాడు. దాంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఈ గజా ఎవరు ? అతనికి వసుంధరకి సంబంధం ఏమిటీ ? చివరకు శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? మధ్యలో ఏమి జరిగింది ? అనేది మిగిలిన కథ.

    – విశ్లేషణ:  

    ఈ సినిమాలో పాటలు, హీరోయిన్, రొమాన్స్ తో దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్ కామెడీని డీల్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంది. అలాగేఎంచుకున్న కథను చెప్పిన విధానం చాలా బాగుంది. వాస్తవికతకు కాస్త దూరంగా అనిపించినా దర్శకుడి స్క్రీన్ ప్లే మాత్రం  ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగిస్తూనే బాగా నవ్విస్తోంది. శ్రీను పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్  లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా  బాగున్నాడు. హీరోయిన్ గా నటించిన నభా నటేష్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో  గ్లామర్ తో  ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది.  ప్రకాష్ రాజ్, ఇంద్రజ, సోనూసూద్ లాంటి మంచి నటులు ఈ చిత్రంలో తమ పాత్రలను అద్భుతంగా పోషించి ఈ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ నవ్విస్తాడు.  అలాగే ఎక్కువ సేపు కనిపించకపోయిన  కీలక పాత్రలో నటించిన అను ఇమాన్యుల్ తన నటనతో ఆకట్టుకుంది. అయితే, సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను  దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అదికాక  నమ్మశక్యం కాని సన్నివేశాలతో, కొన్ని అక్కరలేని సీన్లతో సినిమా ప్లో దెబ్బతింది.

    Also Read: వైరల్ : నిహారిక లవ్ యూ చెప్పింది భర్తకు కాదు..

    -ప్లస్ పాయింట్స్: 

    కామెడీ సీన్స్
    నటీనటులు నటన
    భారీ హంగులు
    కథలోని మలుపులు

    – మైనస్ పాయింట్స్:

    స్క్రీన్ ప్లే,
    మాటలు,
    సెకెండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్
    రొటీన్ ట్విస్ట్ లు, అండ్ క్లైమాక్స్
    రొటీన్ డైరెక్షన్.
    ఎలాంటి కొత్తదనం లేకపోవడం.

    – చివరగా :   

    రొటీన్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో  యాక్షన్ సన్నివేశాలు, కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నా… అక్కడక్కడ కొన్ని దృశ్యాలు పాత సినిమాలను గుర్తుకుచేయడం, అలాగే బోరింగ్ ట్రీట్మెంట్, బ్యాడ్ డైరెక్షన్ సినిమాని చంపేశాయి. ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.

    మూవీ రేటింగ్: 2/5

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్