https://oktelugu.com/

బ్యాంక్ అకౌంట్ మొబైల్ నంబర్ మార్చుకోవాలా..? ఎలా అంటే..?

మనలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా ఉంటుంది. కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ను మనం ఉపయోగిస్తే మాత్రమే బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ప్రతి సమాచారం తెలుస్తుంది. అయితే మనలో చాలామంది బ్యాంక్ అకౌంట్ తీసుకున్న తరువాత వేర్వేరు కారణాల వల్ల మొబైల్ నంబర్ ను మారుస్తూ ఉంటారు. Also Read: సిగ్నల్ యాప్ కు మారుతున్నారా.. వాట్సాప్ గ్రూపులను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 14, 2021 / 06:08 PM IST
    Follow us on

    మనలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా ఉంటుంది. కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ను మనం ఉపయోగిస్తే మాత్రమే బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ప్రతి సమాచారం తెలుస్తుంది. అయితే మనలో చాలామంది బ్యాంక్ అకౌంట్ తీసుకున్న తరువాత వేర్వేరు కారణాల వల్ల మొబైల్ నంబర్ ను మారుస్తూ ఉంటారు.

    Also Read: సిగ్నల్ యాప్ కు మారుతున్నారా.. వాట్సాప్ గ్రూపులను ఎలా మార్చుకోవాలంటే..?

    బ్యాంక్ అకౌంట్ కు ఇచ్చిన మొబైల్ నంబర్ ను మార్చుకున్న తరువాత కచ్చితంగా కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేయించుకోవాలి. మన బ్యాంక్ ఖాతాలో ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే బ్యాంక్ అకౌంట్ కు ఇచ్చిన మొబైల్ నంబర్ ద్వారా ఆ వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోకపోవడం వల్ల చాలా సందర్బాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మొబైల్ నంబర్ ను మార్చుకోవాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా మార్చుకోవచ్చు.

    Also Read: మతిమరుపుతో చిన్న తప్పు చేసిన అమెరికన్.. రూ.1753కోట్లు నష్టం..?

    దేశంలో పలు బ్యాంకులు బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి సులభంగా ఇంటి నుంచే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మొబైల్ నంబర్ ను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయిన తరువాత ప్రొఫైల్ పాస్ వర్డ్ ఎంటర్ చేసి మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సాధ్యం కాకపోతే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఫామ్ నింపి సులభంగా మొబైల్ నంబర్ ను మార్చుకోవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    దేశంలోని పలు ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎం సెంటర్ ద్వారా కూడా మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఏటీఎం, పిన్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా సులభంగా మొబైల్ నంబర్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది.