https://oktelugu.com/

వైరల్ : నిహారిక లవ్ యూ చెప్పింది భర్తకు కాదు..

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ ఇంటి అమ్మాయి అయ్యింది. రాజస్థాన్ లో వీరి పెళ్లి.. మల్దీవుల్లో హానీమూన్ కూడా గ్రాండ్ గా సాగింది. Also Read: అఖిల్-మోనాల్ బయట కూడా వదలట్లేదుగా? అయితే పెళ్లి తర్వాత ఇక సినిమాలు, వెబ్ సిరీసులు నిహారిక చేయదని అంతా అనుకున్నారు. కానీ నిహారిక మాత్రం ఎప్పట్లానే తన సినిమా జీవితాన్ని భర్త చైతన్య అనుమతితో కొనసాగిస్తుండడం విశేషం. తాజాగా నిహారిక పెట్టిన ఓ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 14, 2021 / 02:46 PM IST
    Follow us on

    మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ ఇంటి అమ్మాయి అయ్యింది. రాజస్థాన్ లో వీరి పెళ్లి.. మల్దీవుల్లో హానీమూన్ కూడా గ్రాండ్ గా సాగింది.

    Also Read: అఖిల్-మోనాల్ బయట కూడా వదలట్లేదుగా?

    అయితే పెళ్లి తర్వాత ఇక సినిమాలు, వెబ్ సిరీసులు నిహారిక చేయదని అంతా అనుకున్నారు. కానీ నిహారిక మాత్రం ఎప్పట్లానే తన సినిమా జీవితాన్ని భర్త చైతన్య అనుమతితో కొనసాగిస్తుండడం విశేషం.

    తాజాగా నిహారిక పెట్టిన ఓ పోస్టు వైరల్ అయ్యింది. ‘ఐ లవ్ యూ బంగారూ’ అంటూ నిహారిక పెట్టిన పోస్టు చూసి అందరూ ఆమె భర్తకు చెప్పిందని అనుకున్నారు. కానీ పోస్టు పెట్టింది భర్త గురించి కాదు.. ఆమె మేన బావ ‘వైష్ణవ్ తేజ్’ గురించి… దానికి కారణం ఉంది.

    Also Read: నేరాలకు పాల్పడటం సోనూసూద్ కు అలవాటు !

    జనవరి 13 మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు. ఆయన నటించిన ‘ఉప్పెన’ మూవీ టీజర్ ను కూడా 13న రిలీజ్ చేశారు. బావ వైష్ణవ్ పుట్టినరోజు పురస్కరించుకొని నిహారిక ట్వీట్ చేశారు. ‘ఐ లవ్ యూ బంగారు.. నీకు తెలుసు నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో.. లవ్ యూ వైష్’ గా నిహారిక పోస్టు పెట్టారు.

    చిన్నప్పటి నుంచి నిహారిక, మేనబావలు సాయిధరమ్, వైష్ణవ్ తేజ్ లు అన్నాచెల్లెళ్లుగా ఉంటున్నారు. కలిసే పెరగడంతో వారి మధ్య బంధం బలంగా ఉండడంతో ఈ అప్యాయత అనుబంధాలు కొనసాగుతున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్